Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ చిత్రాల గతిని మార్చిన బాహుబలి: తరుణ్ ఆదర్శ్.. రూ. 1700 కోట్ల వసూళ్లు.. చైనాలో సెప్టెంబర్‌లో విడుదల

‘‘ఓ పక్క కొత్త చిత్రాలు విడులవుతున్నాయి. మరో పక్క ఐపీఎల్ నుంచి, ఐసీసీ చాంపియన్షిప్ వరకు క్రికెట్‌ మ్యాచ్‌ల సందడి కొనసాగుతోంది. కానీ థియేటర్లలో ‘బాహుబలి’ హవా తగ్గలేదు. భారతీయ చిత్రాల గతిని మార్చేసిందీ చిత్రం’’ అని ట్వీట్‌ చేశారు సినీ విశ్లేషకుడు తరణ్

Advertiesment
భారతీయ చిత్రాల గతిని మార్చిన బాహుబలి: తరుణ్ ఆదర్శ్.. రూ. 1700 కోట్ల వసూళ్లు.. చైనాలో సెప్టెంబర్‌లో విడుదల
హైదరాబాద్ , శనివారం, 17 జూన్ 2017 (05:51 IST)
‘‘ఓ పక్క కొత్త చిత్రాలు విడులవుతున్నాయి. మరో పక్క ఐపీఎల్ నుంచి, ఐసీసీ చాంపియన్షిప్ వరకు క్రికెట్‌ మ్యాచ్‌ల సందడి కొనసాగుతోంది. కానీ  థియేటర్లలో ‘బాహుబలి’ హవా తగ్గలేదు. భారతీయ చిత్రాల గతిని మార్చేసిందీ చిత్రం’’ అని ట్వీట్‌ చేశారు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌. ఏప్రిల్‌ 28న విడుదలైన బాహుబలి 2 చిత్రం 1050 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకొంది. ఇదో భారతీయ బాక్సాఫీస్ రికార్డు. ఈ సందర్భంగా ఆ చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌, ట్రైలర్‌ను విడుదల చేసింది.
 
తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన చిత్రం ‘బాహుబలి 2’. భారతీయ సినిమా బాక్సాఫీసు రికార్డులెన్నో ‘బాహుబలి’కి దాసోహం అయ్యాయి. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1700 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇప్పుడు రూ.2000 కోట్ల వసూళ్ల దిశగా అడుగులేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
 
ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ చిత్రం 1050 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకొంది. ఇదో రికార్డు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌, ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘‘ఓ పక్క కొత్త చిత్రాలు విడులవుతున్నా... మరో పక్క క్రికెట్‌ మ్యాచ్‌ల సందడి కొనసాగుతున్నా థియేటర్లలో ‘బాహుబలి’ హవా తగ్గలేదు. భారతీయ చిత్రాల గతిని మార్చేసిందీ చిత్రం’’ అని ట్వీట్‌ చేశారు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1700 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
 
‘దంగల్‌’ చిత్రం వసూళ్లపరంగా దూసుకుపోవడానికి చైనాలో దక్కిన ఆదరణే కారణం. ‘బాహుబలి 2’ కూడా చైనాలో సుమారు 4000 స్క్రీన్లలో సెప్టెంబరులో విడుదల కానుంది. ‘‘బాహుబలి 2’ కథ, విజువల్‌ ఎఫెక్ట్స్‌ చైనీయుల్ని ఆకట్టుకునే అవకాశం ఉంది. అక్కడ విడుదలయ్యాకా ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జపాన్‌, తైవాన్‌, కొరియాల్లోనూ ‘బాహుబలి 2’ విడుదలయ్యే అవకాశాలున్నాయ’’ని ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
వెండితెర ఇలాంటి సినిమా కోసమే కలగన్నాను అని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చెప్పిన మాట నిజమే నినిపిస్తోంది బాహుబలి 2.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రచ్చహ... రచ్చస్య... రచ్చోభ్యహ.. డీజే, పూజా లవ్ ట్రాక్ రచ్చ రచ్చేనట..