Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బాహుబలి' టీమ్ వంటల పోటీ ఫన్నీ వీడియో (Video)

"బాహుబలి" మొదటి, రెండో భాగాలు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తే, ఈ చిత్ర యూనిట్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఎప్పటి నుంచో సోషల్ మీడియాను షే

Advertiesment
'బాహుబలి' టీమ్ వంటల పోటీ ఫన్నీ వీడియో (Video)
, మంగళవారం, 17 అక్టోబరు 2017 (11:13 IST)
"బాహుబలి" మొదటి, రెండో భాగాలు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తే, ఈ చిత్ర యూనిట్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఎప్పటి నుంచో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 
ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పెట్టిన ఓ చిన్నపాటి పోటీ మేరకు.. ప్రభాస్ - వళ్ళి, శోభు - అనుష్క, రాజమౌళి - తమన్నా, శోభు సిరిల్ - ప్రశాంతి, సెంధిల్ కుమార్ - రానా, కీరవాణి - తమన్నాలు జంటలుగా ఏర్పడి వివిధ రకాల వంటలు తయారు చేసేందుకు పూనుకున్నారు. 
 
ఈ వంట పోటీల్లో గెలుపొందిన జంటకు ఓ మంచి బహుమతి ఇస్తానని ఆశ చూపడంతో ఈ జంటలు వంటల తయారీ పోటీల్లో నిమగ్నమైపోతారు. వంటలన్నీ పూర్తయ్యాక వాటిని శుభ్రంగా ఆరగించిన ప్రసాద్.. వారికి బహుమతి ఇవ్వకపోగా, 'మేము సైతం' కోసం ఓ కార్యక్రమం చేయమంటే చేయకుండా తనను తిప్పుకున్నందుకు ఇదే నా పనిష్‌‍మెంట్ అంటు ఫినిషింగ్ టచ్ ఇచ్చి వెళ్లిపోతారు. ఈ ఫన్నీ వీడియోలో పాటలతో పాటు.. ఆటలు ఉన్నాయి. ఆ వీడియోనూ మీరూ చూడండి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్జున్ రెడ్డి సరసన షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనంతపురం అమ్మాయి...