బాహుబలి-2 పోస్టర్‌పై నెట్టింట్లో రచ్చ.. అనుష్క విల్లుపై ప్రభాస్ బాణాలు ఎలా వచ్చాయ్
బాహుబలి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి-2 పోస్టర్ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంటున్న బాహుబలి-2కు సంబంధించిన పోస్టర్లో నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ పోస్టరున
బాహుబలి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి-2 పోస్టర్ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంటున్న బాహుబలి-2కు సంబంధించిన పోస్టర్లో నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ పోస్టరును నిశితంగా పరిశీలిస్తే, ఓ పెద్ద తప్పు దొర్లిందంటున్నారు నెటిజన్లు. నెట్టినింట ఈ వివాదం పెద్ద చర్చగా మారింది. ఈ పోస్టరులో విల్లంబులు పట్టుకుని ముందు అనుష్క, ఆ వెనుక ప్రభాస్ వాటిని ఎక్కుపెట్టి ఉన్నారు.
ఒక్కసారి వాటిని పరిశీలిస్తే, వెనక ఉన్న ప్రభాస్ బాణాలు, అనుష్క విల్లుపై కనిపిస్తున్నాయి. ఇదెలా సాధ్యమని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు అనుష్క విల్లుపైకి ప్రభాస్ సంధిస్తున్న బాణాలు ఎలా వచ్చాయని ప్రశ్నలు సంధిస్తున్నారు. జక్కన్న టీమ్ ఈ చిన్న పొరపాటును గమనించలేదని కామెంట్స్ వస్తున్నాయి. ఇక దీనిపై జక్కన్న స్పందన ఇంకా రాలేదు.