Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నగ్నంగా నటించేందుకు నా భర్త అభ్యంతరం చెప్పడు.. పైగా ప్రోత్సహిస్తాడు: రాధికా ఆప్టే

స్టోరీ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు అభ్యంతరం లేదని సినీ నటి రాధికా ఆప్టే మరోమారు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. పైగా, నగ్నంగా నటించడం పట్ల తన భర్త కూడా అభ్యంతరం వ్యక్తం చేయడని... పైగా ప్రోత్సహిస్త

Advertiesment
నగ్నంగా నటించేందుకు నా భర్త అభ్యంతరం చెప్పడు.. పైగా ప్రోత్సహిస్తాడు: రాధికా ఆప్టే
, మంగళవారం, 31 జనవరి 2017 (10:39 IST)
స్టోరీ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు అభ్యంతరం లేదని సినీ నటి రాధికా ఆప్టే మరోమారు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. పైగా, నగ్నంగా నటించడం పట్ల తన భర్త కూడా అభ్యంతరం వ్యక్తం చేయడని... పైగా ప్రోత్సహిస్తాడని చెప్పింది. రాధికా ఆప్టే ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ జనాల మతులు పోగొడుతోంది. 
 
నిజానికి ఈ తరం సినీ హీరోయిన్లు అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకడుగు వేయరు. పైగా యూత్‌లో తమకు బోలెడంత క్రేజ్ వస్తుందనే భావనలో వారు ఉన్నారు. ఇక బాలీవుడ్ భామలైతే హాలీవుడ్ హీరోయిన్లతో పోటీ పడే స్థాయికి చేరుకున్నారు. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే కూడా ఇదే భావనతో ఉంది. 
 
హిందీ సినిమా 'పార్చ్ డ్'లో ఏకంగా నగ్నంగా కనిపించి జనాలకు షాక్ ఇచ్చింది రాధిక. అంతకు ముందు ఓ బెంగాలీ షార్ట్ ఫిల్మ్‌లో అర్థర్ధనగ్నంగా కనిపించింది. తన చేసే క్యారెక్టర్ల గురించి బోల్డ్‌గా మాట్లాడటం రాధికా ఆప్టే స్పెషాలిటీ. తాజాగా ఆమె మరో సంచలన వ్యాఖ్య చేసింది. కథతో సంబంధం ఉంటేనే అర్ధనగ్నంగా నటించడానికి తాను ఇష్టపడతానని చెప్పింది. స్టోరీ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో సరసన నటిస్తే లింకున్నట్టు అంటగట్టేస్తారా? తాప్సీ