హీరో సరసన నటిస్తే లింకున్నట్టు అంటగట్టేస్తారా? తాప్సీ
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానాతో తనకు ఉన్న సంబంధం ఉన్నట్టు వచ్చిన వార్తలపై నటి తాప్సీ మండిపడింది. ఓ హీరో సరసన నటించినంతమాత్రానా ఆ హీరోతో సంబంధం ఉన్నట్టు అంటగట్టడమేనా అని నిలదీసింద
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానాతో తనకు ఉన్న సంబంధం ఉన్నట్టు వచ్చిన వార్తలపై నటి తాప్సీ మండిపడింది. ఓ హీరో సరసన నటించినంతమాత్రానా ఆ హీరోతో సంబంధం ఉన్నట్టు అంటగట్టడమేనా అని నిలదీసింది. రానా, తాప్సీ కాంబినేషన్‌లో ఘాజీ చిత్రం రానుంది. ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని తాప్సీకి రానానే ఇప్పించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అసలు సినిమాలో కలిసి నటించకపోయినా త్రిష, శ్రియాలతో రానా ఎఫైర్ ఉన్నట్టు మాట్లాడిన మీడియా ఇప్పుడు కొత్తగా రానా లవర్స్ లిస్ట్‌లో తాప్సిని కూడా చేర్చారు.
దీనిపై తాప్సీ స్పందిస్తూ... ఘాజీ సినిమాలో నటించడం, ఈ చిత్రం తెలిసిందే. ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఇద్దరు కాస్త చనువుగా ఉన్నమాట నిజమే. అంతమాత్రానా తనకూ రానాకు లింకు పెట్టేస్తారా అని నిలదీశారు. రానా తననే సెలెక్ట్ చేసుకోవానికి కారణం హిందీలో తాను నటించిన సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో తనని సెలెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాని తనకు రానాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెపుతోంది. తను నాకు మంచి స్నేహితుడు మాత్రమే స్పష్టం చేసింది.