Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలి-2 ట్రైలర్ డైలాగులో తప్పుందట? అక్కడ "ఇంకా" అనే పదం ఎందుకొచ్చిందని ప్రశ్న?

బాహుబలి-2 ప్రభాస్, అనుష్క పోస్టర్‌లో బాణాల్లో ఎర్రర్ ఉన్నట్టు గుర్తించి రాజమౌళి దృష్టికి తీసుకెళ్లారు ఫ్యాన్స్. ఆ తప్పును రాజమౌళి కూడా సరిదిద్దుకున్నారు. అయితే ప్రస్తుతం భాషా నిపుణులు ట్రైలర్‌లోని భాష

బాహుబలి-2 ట్రైలర్ డైలాగులో తప్పుందట? అక్కడ
, శుక్రవారం, 17 మార్చి 2017 (13:31 IST)
బాహుబలి-2 ప్రభాస్, అనుష్క పోస్టర్‌లో బాణాల్లో ఎర్రర్ ఉన్నట్టు గుర్తించి రాజమౌళి దృష్టికి తీసుకెళ్లారు ఫ్యాన్స్. ఆ తప్పును రాజమౌళి కూడా సరిదిద్దుకున్నారు. అయితే ప్రస్తుతం భాషా నిపుణులు ట్రైలర్‌లోని భాషపై ఫైర్ అవుతున్నారు. అందులో ఓ తప్పుందంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. బాహుబలి- ది కంక్లూజన్‌ ట్రైలర్‌లో 'బాహుబలి' కట్టప్ప వంక చూస్తూ 'నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపేవాడు ఇంకా పుట్టలేదు మామా..' అని అంటాడు. వినడానికి ఈ డైలాగ్ చాలా ఎఫక్టీవ్‌గా ఉన్నప్పటికీ.. అందులో భాషా దోషాలున్నాయని భాషా నిపుణులు అంటున్నారు. 
 
నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ అనేది.. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. పుట్టలేదు మామా.. ఫాస్ట్ పర్ఫెక్ట్. ఈ రెండింటి మధ్య ఇంకా అనే పదం ఎందుకు వచ్చిందని.. ఈ డైలాగ్ తప్పని విమర్శకులు వాదిస్తున్నారు. 'నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపేవాడు పుట్టడు మామా..' అని అనాలి 'నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపేవాడు ఇంకా పుట్టలేదు మామా..' అని బాహుబలి డైలాగ్ రైటర్ ఏ విధంగా రాశాడని ప్రశ్నిస్తున్నారు. 
 
అయితే ఈ డైలాగ్‌ను తప్పుపట్టడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తెలుగు భాషను, సంస్కృతిని ఖూనీ చేస్తూ ఎన్నో సినిమాలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. బాహుబలి-2 ట్రైలర్ డైలాగునే ఎందుకు పట్టుకుని తప్పులు కనిపెడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కారణం భారీ బడ్జెట్‌తో ప్రపంచ దేశాల్లో బాహుబలి క్రేజ్ అమాంతం పెరిగిపోవడమే కారణమని, ఇంకా  రాజమౌళిపై ఈర్ష్య అనుకోవాలని వారు ఫైర్ అవుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థ్యాంక్యూ వదినా... సమంతతో అక్కినేని అఖిల్...