'బాహుబలి'ని వదిలేసిన రాజమౌళి... హమ్మయ్య...
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బాహుబలి-2' చిత్రం నేటితో షూటింగ్ పూర్తవుతుందని చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్, రానా కెరీర్‌లోనే మైలురాయిలా నిలిచిన ఈ చిత్రం మొదటి భాగం ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రాజమౌళి పేరు ఖండా
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బాహుబలి-2' చిత్రం నేటితో షూటింగ్ పూర్తవుతుందని చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్, రానా కెరీర్‌లోనే మైలురాయిలా నిలిచిన ఈ చిత్రం మొదటి భాగం ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రాజమౌళి పేరు ఖండాంతరాలకు వ్యాపించిచడమే కాకుండా.. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని రాజమౌళికి ఇవ్వడం గత ఏడాది ప్రత్యేకం.
ఈ చిత్రం తర్వాత సినిమా టేకింగ్, మేకింగ్‌లలో టెక్నాలజీ విలువలు మరింత జాగ్రత్తగా వుండేలా పలువురు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, శుక్రవారంతో బాహుబలి-2 చిత్రం షూటింగ్ పూర్తవడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. రెండు భాగాలు కలిపి 613 రోజులు షూటింగ్ జరిపామని ప్రకటనలో పేర్కొన్నారు.