Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి ప్రి-రిలీజ్... స్టేజీపై ఏడ్చేసిన రాజమౌళి

ఎస్ఎస్ రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణి అంటే ఇక వేరే చెప్పక్కర్లేదు. వారి కాంబినేషన్ హిట్ కాంబినేషన్. రామోజీ ఫిలిమ్ సిటీలో బాహుబలి ప్రి-రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి అద్భుతమైన దర్శకత్వం పైన పెద్దన్న అని పిలుచుకునే కీరవాణి ఓ ఏవీ తయారు చేసి

Advertiesment
బాహుబలి ప్రి-రిలీజ్... స్టేజీపై ఏడ్చేసిన రాజమౌళి
, ఆదివారం, 26 మార్చి 2017 (23:37 IST)
ఎస్ఎస్ రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణి అంటే ఇక వేరే చెప్పక్కర్లేదు. వారి కాంబినేషన్ హిట్ కాంబినేషన్. రామోజీ ఫిలిమ్ సిటీలో బాహుబలి ప్రి-రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి అద్భుతమైన దర్శకత్వం పైన పెద్దన్న అని పిలుచుకునే కీరవాణి ఓ ఏవీ తయారు చేసి స్టేజిపై పాడి వినిపించారు. ఈ సందర్భంగా రాజమౌళిని స్టేజిపైకి రమ్మంటూనే ఆ గీతాన్ని ఆలపిస్తుండగా రాజమౌళి ఉద్వేగానికి లోనయ్యారు. ఏడ్చేసారు. ఈ దృశ్యం చూసిన ప్రతివారికి జక్కన్న-కీరవాణి మధ్య వున్న ఆత్మీయతానురాగం ఎంత బలమైందో అర్థమవుతుంది.
 
రాజమౌళి ఏమిటో తెలియజెపుతూ కీరవాణి ఈ ఏవీని తయారు చేసారు. పెద్దవారి పట్ల రాజమౌళి ఎలా వుంటారో, పని పట్ల ఎలా ప్రవర్తిస్తారో, ఇంకా దర్శకుడుగా జక్కన్న కష్టం ఏమిటో తెలియజెపుతూ సాగిన ఈ ఏవీ ద్వారా జక్కన్నను కీరవాణి దీవించారు. ఆ పాటలో సాహిత్యం ద్వారా హృదయాలను టచ్ చేసారు కీరవాణి.
 
పాట పాడుతూనే రాజమౌళి... రా అంటూ కీరవాణి పిలిచినప్పుడు ఉద్వేగానికి లోనవుతూనే రాజమౌళి స్టేజిపైకి ఎక్కారు. ఆ తర్వాత ఏవీ సాగుతుండగానే ఆయన స్టేజిపైన ఏడ్చేసారు. ఈ ప్రి-రిలీజ్ వేడుకలో ఉద్విగ్న క్షణాలు ఇలా ఆవిష్కృతమయ్యాయి. నిజానికి రాజమౌళి ఉద్వేగం తన్నుకొచ్చినా బయటకు రానివ్వరు. అలాంటిది జక్కన్న తొలిసారిగా తన అన్నయ్య కీరవాణి ఏవితో టచ్ చేసారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ ఖాతాలోకి రూ.కోట్లు.. సినిమాల ద్వారా ఎన్నికలకు నిధుల సేకరణ!