Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్షమించాలి రాజమౌళీ.. బాహుబలి-2 పై తప్పు వ్యాఖ్య చేశాను.. బాలీవుడ్ చిత్ర విమర్శకుడి పశ్చాత్తాపం

బాహుబలి2 అంత చెత్తసినిమాను తన జీవితంలోనే చూడలేదు. ఇక దక్షిణాది సినిమాలు చూడను గాక చూడను అంటూ శపథం చేసి బాహుబలి2 పై విషం గక్కిన స్వయం ప్రకటిత బాలీవుడ్ విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్‌కే ఎట్టకేలకు కాస్త దిగివచ్చి ఎస్ఎస్ రాజమౌళికి క్షమాపణలు చె

Advertiesment
క్షమించాలి రాజమౌళీ.. బాహుబలి-2 పై తప్పు వ్యాఖ్య చేశాను.. బాలీవుడ్ చిత్ర విమర్శకుడి పశ్చాత్తాపం
హైదరాబాద్ , సోమవారం, 15 మే 2017 (05:47 IST)
బాహుబలి2 అంత చెత్తసినిమాను తన జీవితంలోనే చూడలేదు. ఇక దక్షిణాది సినిమాలు చూడను గాక చూడను అంటూ శపథం చేసి బాహుబలి2 పై విషం గక్కిన స్వయం ప్రకటిత బాలీవుడ్ విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్ అలియాస్ కేఆర్‌కే ఎట్టకేలకు కాస్త దిగివచ్చి ఎస్ఎస్ రాజమౌళికి క్షమాపణలు చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 చిత్ర 1500 కోట్లు సాధించిన నేపథ్యంలో ఆ సినిమా విడుదలైన తొలి రోజున తప్పు వ్యాఖ్య చేసినందుకు గాను కేఆర్‌కే పశ్చాత్తాపం ప్రకటించాడు.
 
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత గొప్ప హిట్ చిత్రంగా  బాహుబలి-2 ఆవిర్భవించిన తరుణంలో బాలీవుడ్ విమర్శకుడు కేఆర్‌కే యూటర్న్ తిరిగాడు. బాహుబలి2 సినిమాపై తప్పు సమీక్ష రాసినందుకు క్షమాపణలు. ఆ సినిమాను నేను ఇష్టపడటంలేదు కానీ జనం ఇచ్చిన తీర్పు దైవ వాక్కు లాంటిది. వెరీ సారీ రాజమౌళీ అంటూ కేఆర్‌కే ట్వీట్ చేశాడు. ఇతడి ట్విట్టర్‌కు 39 లక్షలమంది ఫాలోయర్లు ఉన్నారు. 
 
విడుదలైన రోజునే బాహుబలి2పై కేఆర్‌కే చేసిన ఘోర సమీక్ష ఆ సినిమా బాక్సాఫీసు వసూళ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. పైగా బాహుబలి-2 చూసిన అనుభవంతో ఇక దక్షిణ భారత చిత్రాన్ని ఎన్నడూ చూడను అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. పైగా రానా తన ట్విట్టర్‌ను బ్లాక్ చేశాఢన్న వార్తతో మరింత ఆగ్రహించిన కేఆర్కే.. ఈ ఇడియట్‌ను నేనెప్పుడూ ఫాలో కాలేదు. ట్వీట్ చేయలేదు. కానీ తానెంత మందబుద్దో నిరూపించుకుంటూ నా ట్విట్టర్‌ను బ్లాక్ చేశాడు అంటూ రానాను దూషించాడు. ఇక ప్రభాస్‌ని అయితే ఒంటెలాగా ఉన్నాడు. బాలీవుడ్‌లో సినిమాలు చేయడం కూడానా అంటూ కేఆర్కే ఈసడించాడు. దీనికి రానా స్పందిస్తూ కేఆర్కే‌ను తాను సంవత్సరం క్రితమే బ్లాక్ చేశానని, ఆ వెధవకు  ఆ విషయం కూడా తెలియదంటూ తిప్పికొట్టాడు.
 
బాహుబలి-2 పట్ల గతంలో వ్యవహరించిన దానికి భిన్నంగా రాజమౌళిని క్షమాపణలు కోరుతూ కేఆర్కే పెట్టిన తాజా ట్వీట్ చాలామందిని ఆశ్చర్యపరిచింది. అతడు సదుద్దేశంతోనే క్షమాపణలు చెప్పాడా లేదా అనేది మరొక విషయం. కానీ బాహుబలి-2 దర్శకుడు రాజమౌళిని ఉద్దేశించి తాను రాసిన పదాలు కొంత నిజాయితీనే ప్రకటిస్తున్నట్లున్నాయి.
 
 KRK ✔ @kamaalrkhan
I m very sorry for my wrong review of #Baahubali2! I didn't like it but ppl like it n Janta Ki Awaaz means Nakkare Khuda. Sorry @ssrajamouli
2. 47 PM - 14 May 2017
 
ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి2 సినిమాకు కనీవినీ ఎరుగని స్పందన కనిపించింది. బాలీవుడ్ లోనే భారీ కలెక్షన్లు సాధించిన సుల్తాన్, దంగల్ వంటి తాజా సినిమాల రికార్డును బాహుబలి 2 తుడిచి పెట్టేసింది. హిందీ వెర్షన్ ఒక్కటే 413 కోట్ల రూపాయలు వసూలుచేసి ఆల్ టైమ్ హిట్ సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు 1500 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వూ నీ కచ్చేరీ.. పోవోయ్.. పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌ ముంబై కాన్సర్ట్‌ను ఉతికి ఆరేసిన అమలాపాల్