Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వూ నీ కచ్చేరీ.. పోవోయ్.. పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌ ముంబై కాన్సర్ట్‌ను ఉతికి ఆరేసిన అమలాపాల్

పెళ్లయి సంవత్సరం కాకముందే భర్తతో విడాకులు తీసుకున్న మలయాళ హీరోయిన్ అమలాపాల్ సినిమా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఇండియాకు వచ్చిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌పై సెటైర్లు వేసింది. చేతిలో పక్షులత

Advertiesment
Malliwood heroin amalapal fired
హైదరాబాద్ , సోమవారం, 15 మే 2017 (04:19 IST)
పెళ్లయి సంవత్సరం కాకముందే భర్తతో విడాకులు తీసుకున్న మలయాళ హీరోయిన్ అమలాపాల్ సినిమా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఇండియాకు వచ్చిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌పై సెటైర్లు వేసింది. చేతిలో పక్షులతో దిగిన ఫొటోలను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేస్తూ బీబర్ కన్నా ఇవే బాగా పాడుతాయని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన సినీ పెద్దలు, ఆమె అభిమానులు అమలా ఏంటి ఒక్కసారిగా ఇలా అనేసిందంటూ అవాక్కయ్యారట.
 
అంతర్జాతీయ ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కొద్ది రోజుల క్రితం ముంబైలో నిర్వహించిన కాన్సర్ట్‌కి బాలీవుడ్ జనాలు తమ ఫ్యామిలీలతో సహా వాలిపోయారు. ఒక్కో టిక్కెట్ వెల 75 ,000 (75 వేల) రూపాయలు పెట్టి మరీ కొన్న ఈ కాన్సర్టుకి ముంబైలోని స్టేడియం మొత్తంగా నిండిపోయింది. కేకలు, అరుపులు, రంకెలు, చెవులు దిబ్బెళ్లు పట్టించే సంగీత రణగొణ ధ్వనులతో సాగిన బీబర్ కాన్సర్ట్ దానిపై ఆసక్తి, అభిరుచి ఉన్న ఎంతోమందిని ఉర్రూతలూగించినా చాలామందిని మాత్రం నిరాశపరిచింది.
 
కేవలం లిప్ సింక్‌తో పనికానిచ్చేసిన సింగర్ అభిమానులను నిరుత్సాహపరిచాడు. అంటే ముందే రికార్డయిన పాట స్పీకర్లనుంచి వస్తుంటే దానికి తగినట్లుగా పెదాలు కదపటం అన్నమాట. అయితే ఆ స్పీకర్లలోంచి రికార్డయిన పాటలకు బీబర్ పెదాలు కలపలేకపోవడం అందరికీ తెలిసిపోయింది. దీంతో లక్షలు పోసి టిక్కెట్టు కొనుక్కుని వస్తే కాపీ కాన్సర్ట్‌ను చూపిస్తావా అంటూ మరుసటిరోజు మీడియాలో బీబర్‌పై చెలరేగిపోయారు. 
 
ఇక ఈ కార్యక్రమానికి హాజరైన సెలబ్రిటీలకు సరైన సెక్యూరిటీ కూడా చేయలేదన్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా అమలాపాల్ కూడా కాన్సర్ట్  వెళ్లి తిరిగివచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ బాధతోనే అమ్మడు ఇలా పాప్ స్టార్‌‌పై అక్కసు వెళ్లగక్కిందట. ఎంతైనా 75 వేల రూపాయల టిక్కెట్ కదా. ఆ మాత్రం మండదేమిటి?
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లంటే విముఖత చూపుతున్న హీరోయిన్లు... అదే కోవలో ధన్సిక