అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో గతంలో ఎన్నడూ చూడని కథతో రాచరికం అనే మూవీ రాబోతోంది. ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్ తీసుకొస్తున్నారు మేకర్స్.
రీసెంట్ గా రాచరికం మూవీ నుంచి హీరోయిన్ అప్సరా రాణి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. కాళీ మాత ఉగ్ర రూపం దాల్చితే, రక్తంతో ఒళ్లంతా తడిసి ముద్దైతే ఎలా ఉంటుందో.. ఈ పోస్టర్‌లో అప్సరా రాణి అలా కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే అప్పరా రాణికి అద్భుతమైన పాత్ర లభించినట్టుగా కనిపిస్తోంది. థ్రిల్లింగ్ కాన్సెప్ట్, డిఫరెంట్ కంటెంట్, సగటు ప్రేక్షకుడిని కట్టిపడేసే సన్నివేశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సారథి స్టూడియోస్ లో శరవేగంగా జరుగుతున్నాయి. చివరిదశ పనుల్లో ఉన్న ఈ సినిమాపై జనాల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ చిత్రంలో హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో వరుణ్ సందేశ్ రోల్ మాస్ ఆడియన్స్ కి పూనకాలు తీప్పిస్తుందట. ఈ మూవీకి వెంగి సంగీతాన్ని అందించగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్‌గా పని చేశారు.
రామ్ ప్రసాద్ మాటలు అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చాణక్య, ఎడిటర్‌గా జేపీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.