Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో అశ్విన్ బాబు శివం భజే చిత్రం

Advertiesment
Ashwin Babu

డీవీ

, మంగళవారం, 18 జూన్ 2024 (17:15 IST)
Ashwin Babu
అశ్విన్ బాబు హీరోగా  దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం  'శివం భజే'.  అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించింది. గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఉగ్ర రూపంలో అశ్విన్ లుక్, శివస్మరణతో టైటిల్, బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర ఇలా అనౌన్స్ చేసిన ప్రతీ అప్డేట్ కి పెరిగిపోతున్న అంచనాలు దృష్టిలో ఉంచుకుని నిర్మాత రేపు సాయంత్రం 4:05 గంటలకి టీజర్ విడుదల చేయనున్నారు.
 
దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టవల్-24 'బెస్ట్ సినిమాటోగ్రఫీ' అవార్డు గ్రహీత దాశరథి శివేంద్ర విజువల్స్, అశ్విన్ బాబు, అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన వంటి నటుల నటన, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ పనితనం, ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్ కళాత్మకత, మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస అద్దిరిపోయే స్కోర్, పృథ్వి, రామకృష్ణ మాస్టర్స్ ఫైట్స్ ఈ టీజర్ లో హైలైట్ అవ్వనున్నాయన్నారు.
 
పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచవ్యప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దర్శకుడు తేజ ఆవిష్కరించిన పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ లోగో