Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క నిశ్శ‌బ్ధం ఎంతవ‌ర‌కు వ‌చ్చింది.?

Advertiesment
అనుష్క నిశ్శ‌బ్ధం ఎంతవ‌ర‌కు వ‌చ్చింది.?
, శనివారం, 28 సెప్టెంబరు 2019 (21:58 IST)
అరుంధ‌తి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మతి... ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి మెప్పించిన అందాల తార‌ అనుష్క. ఆమె న‌టించిన‌ తాజా చిత్రం నిశ్శ‌బ్ధం. ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
 
ఇటీవ‌ల రిలీజ్ చేసిన నిశ్శ‌బ్ధం ఫ‌స్ట్ లుక్‌కి మంచి స్పంద‌న ల‌భించింది. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరిగింది. ఈ సినిమాలో ఆమె మ్యూట్ ఆర్టిస్ట్‌గా కనిపించనుంది. ఓ కీలకమైన పాత్రలో మాధవన్ నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హాలీవుడ్ నటుడు మైఖేల్ కనిపించనున్నాడు. 
 
ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోలో డ‌బ్బింగ్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. దసరా పండుగకి ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళ్, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాల‌య్య మూవీ టీజ‌ర్ వ‌చ్చేస్తుంది... ఇంత‌కీ ఎప్పుడు..?