Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

Advertiesment
Anil Ravipudi - Chiranjeevi

దేవీ

, బుధవారం, 13 ఆగస్టు 2025 (12:43 IST)
Anil Ravipudi - Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి తో దర్శకుడు అనిల్ రావిపూడి Mega157 చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా  గురించి పలు ఆసక్తికరమైన విషయాలు అనిల్ చెప్పాడు. చిరంజీవి పాత్ర ఎలావుంటుందనే దానికి ఆయన బదులిస్తూ... చిరంజీవిగారు సెకండ్ ఇన్నింగ్స్ వచ్చాక సైరా మినహా మిగిలిన సినిమాలలో మాస్ పాత్రలు పోషించారు. కనుక ఆయన్ను సరికొత్తగా చూపించాలనే ప్రయత్నం చేశాను. ఘరానా మొగుడు ఫ్లేవర్ తోపాటు స్టయిలిష్ గా ఆయన పాత్ర డిజైన్ చేశాను. 
 
అయితే, చిరంజీవిగారి పుట్టినరోజు ఆగస్టు 22 ఎప్పుడు వస్తుందా .. అని నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు చిరంజీవిని చూపని విధంగా నేను డిజైన్ చేసిన లుక్ విడుదలకాబోతుంది. అందుకు సినిమా యూనిట్ కూడా చాలా  ఎగ్జైట్ మెంట్ తో వున్నారని చెప్పారు. 
 
సినిమా షూటింగ్ గురించి చెబుతూ.. ఇప్పటికి ఇంటర్ వెల్ వరకు పూర్తయింది. సెకండాఫ్ మొదలు పెట్టాలి మధ్యలో అనుకోకుండా కార్మికుల సమ్మె రావడంతో షూటింగ్ వాయిదావేసుకోవాల్సి వచ్చింది. దీని ద్వారా నటీనటులు, టెక్నీషయిన్ల డేట్స్ వేస్ట్ అయ్యాయి. నిర్మాత బాగా నష్టపోయాడు అని చెప్పారు. 
 
ఇక చిరంజీవి నటించిన విశ్వంభర ఇప్పటికే రిలీజ్ కావాల్సి వుంది. ఇంకా దాని గురించి పూర్తి సమాచారం మాత్రం చిత్ర యూనిట్ ఇవ్వలేదు. ఇంకా సీజీ వర్క్ వుందని చెబుతున్నారు.
 
ఇదిలా వుండగా, చిరంజీవి 157 సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. నయనతార నాయికగా నటిస్తోంది.
 
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ,  జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. #Mega157 మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?