ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది.
దీంతో ఈనెల 30నుంచి ఏపీలో సినిమా హాల్స్ తెరుచుకోనున్నాయి. అయితే జీవో నెంబర్ 35తో సీ సెంటర్‌లో సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు అంటున్నారు. దీంతో ఏపీలో థియేటర్లు తెరుచుకుంటాయో లేదో వేచి చూడాల్సిందే. కాగా, తెలంగాణలోనూ సినిమా థియేటర్లు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే.