Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రదీప్ 'పెళ్లి చూపులు' మధ్యలో కంటతడి పెట్టిన సుమ... ఆ ఏడుపుకి కారణం?

బుల్లితెర‌పై త‌న మాట‌ల గార‌డీతో స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న యాంక‌ర్ సుమ క‌న‌కాల‌. కేరళలో పుట్టినప్పటికీ తెలుగువారి కంటే అనర్గళంగా మాట్లాడుతూ తన సమయస్ఫూర్తితో తనకు సాటి మరెవరూ లేరని నిరూపించుకుంది.

Advertiesment
Anchor Suma
, శుక్రవారం, 5 అక్టోబరు 2018 (13:44 IST)
బుల్లితెర‌పై త‌న మాట‌ల గార‌డీతో స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న యాంక‌ర్ సుమ క‌న‌కాల‌. కేరళలో పుట్టినప్పటికీ తెలుగువారి కంటే అనర్గళంగా మాట్లాడుతూ తన సమయస్ఫూర్తితో తనకు సాటి మరెవరూ లేరని నిరూపించుకుంది. ఎంతో ఓర్పుతో సందర్భోచితంగా ఆరోగ్యవంతమైన హాస్యంతో ఇన్ని సంవత్సరాలు విజయవంతంగా వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఏమంత సాధారణ విషయమేమీ కాదు. 
 
ప్రస్తుతం యాంకర్‌లుగా కొనసాగుతున్న ఎంతోమందికి స్ఫూర్తిగా ఉంటూ సక్సెస్‌కు మారుపేరుగా ఉంది. 12 ఏళ్లుగా స్టార్ మహిళ అనే ప్రోగామ్‌ని ఏకధాటిగా నడిపిస్తూ ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో కూడా స్థానం సంపాదించుకుంది. మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు, చిన్నపిల్లలు అభిమానులుగా ఉన్నారు. ఇప్పటికే మూడువేలకి పైగా ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న ఈ షో శుభం కార్డు పడింది.
 
ఇక ఈమధ్య కాలంలో ఆమె తక్కువ సంఖ్యలో షోలు చేస్తున్నారు. ఇటీవల యాంకర్ ప్రదీప్ పెళ్లిచూపులు కార్యక్రమానికి యాంకర్‌గా చేస్తున్నారు సుమ. రొటీన్‌కు భిన్నంగా తెలుగులో మొదటిసారి ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. స్టార్ మా ఛానెల్‌లో బిగ్ బాస్ ముగిశాక ఇప్పుడు ఇది వస్తోంది. హిందీ మరియు తమిళంలో ఇప్పటికే ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. దేశవిదేశాల నుండి ఎంతో మంది అమ్మాయిలు రిజిస్టర్ అవుతున్నారు. కాగా వారిలో 14 మందిని ఎంపిక చేసారు. వీరిలో నుండి ప్రదీప్ తన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారట. ఈ కార్యక్రమంపై ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆసక్తికరంగా చూస్తుంటే మరికొంతమంది ఏంటీ గోల అంటూ తల పట్టుకుంటున్నారు.
 
ఇటీవలి ఎపిసోడ్‌లో ప్రదీప్‌ను ఇంప్రెస్ చేసేలా లేఖ రాయమని 14 మంది కంటెస్టెంట్స్‌కు సుమ చెప్పగా, రాజీవ్ గారికి లెటర్ రాయమని ప్రదీప్ సుమను కోరాడు. లేఖను వ్రాయడం మొదలుపెట్టిన సుమ రాస్తూ రాస్తూ మధ్యలో ఆమెకు తెలియకుండానే కంటతడి పెట్టింది. ఇలాంటి ఎమోషన్ ఉన్న అమ్మాయే తనకు భార్యగా రావాలని ప్రదీప్ పేర్కొన్నాడు. మరి సుమ-రాజీవ్ ఎలా ప్రేమించుకున్నారో... అలాగ ప్రదీప్‌కు కూడా లవ్ కుదరాలి కదా. పెళ్లి చూపులతో అది కుదురుతుందా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోటా సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లు ఖాళీ.. ఎందుకు?