Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాశిఖన్నా రూ.25లక్షలు తీసుకుంటుంటే.. అనసూయకు రూ.50లక్షల పారితోషికం కావాలట..!

Advertiesment
Anasuya
, సోమవారం, 6 జూన్ 2016 (11:34 IST)
జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయిన అనసూయ.. వెండితెరపై తన సత్తా ఏంటో చాటుకుంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జున మరదలిగా నటించిన అనసూయ, ఆ తర్వాత అడవిశేషు సినిమాలో పోలీసాఫీసర్‌గా నటించింది. దీంతో ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయకి... అమాంతం ఒకేసారి క్రేజ్ వచ్చి పడింది.

ఈ క్రేజ్‌ను అనసూయ క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. అందుకే వెండితెరపై నటించాలంటే భారీ పారితోషికం కావాలని పట్టుబడుతోంది. బుల్లితెరపై అత్యధిక పారితోషికం పుచ్చుకున్న యాంకర్‌గా మారిన అనసూయ.. తనకి రూ.50లక్షలు ఇవ్వగలిగే వారు మాత్రమే స్క్రిప్టు చెపేందుకు చెప్పేందుకు రావాలని అనసూయ అన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
రాశిఖన్నాలాంటి హీరోయిన్లే... రూ.25 లక్షలకి నటిస్తుంటే, అనసూయ అంత డిమాండ్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలను కూడా అనసూయ తిప్పికొట్టింది. తాను బుల్లితెరపై ఒక్క ఎసిపోడ్‌కి రూ.లక్ష తీసుకుంటుంటే... సినిమా చేసేందుకు రూ.50లక్షలు తీసుకోవడంలో తప్పేంటని ప్రశ్నించింది.

అలాగే తన ఫేస్ బుక్ ఎకౌంట్‌కు ఉన్న క్రేజ్‌ని బట్టి చూస్తే రూ.50లక్షలు ఇవ్వడంలో తప్పేమీలేదంటోంది. అనసూయ సినీ ఇండస్ట్రీని బాగా అర్థం చేసుకుందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ హుషారులో రకుల్ ప్రీత్ సింగ్.. ఆ సెంటిమెంట్‌‍తో పవర్‌కు దెబ్బేనా?!