Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

Advertiesment
Ananthika Sanilkumar, Hanu Reddy

దేవి

, సోమవారం, 3 మార్చి 2025 (17:24 IST)
Ananthika Sanilkumar, Hanu Reddy
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్  ఫస్ట్ సింగిల్ 'అందమా అందమా'ను విడుదల చేసి మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు.
 
సోల్ ఫుల్ నెంబర్స్ కి పాపులరైన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఒక అందమైన లవ్ మెలోడీని స్వరపరిచారు, ఇది ఒక యువకుడి మనసుని దోచుకున్న అమ్మాయి పట్ల అతని అనురాగాన్ని ప్రజెంట్ చేస్తోంది. విన్నవెంటనే కనెక్ట్ అయ్యే ఈ పాట ఆడియన్స్ ని కట్టిపడేసింది.
 
మెలోడిక్ అకౌస్టిక్ గిటార్ సోల్ ఫుల్ టచ్ తీసుకొచ్చింది. ప్రతి వాయిద్యం లవ్ ఎమోషన్ డెప్త్ ప్రజెంట్ చేస్తోంది. వనమాలి రాసిన సాహిత్యం కవితాత్మకంగా వుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్, ఆవాని మల్హర్‌తో కలసి మెస్మరైజింగ్ గా ఈ పాటని ఆలపించారు. హను రెడ్డి, అనంతిక బ్యుటీఫుల్ కెమిస్ట్రీ షేర్ చేసుకున్నారు. విజువల్స్ పాటలానే ఆకట్టుకున్నాయి.
 
నవీన్ యెర్నేని,వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైన్‌ను, శశాంక్ మాలి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.  బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతమైన కథనంతో ఆకట్టుకుంటుంది. నిర్మాతలు త్వరలో సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తారు.
 
తారాగణం: అనంతిక సనిల్‌కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్