ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ హిట్ అయ్యింది. రెండేళ్ల కిందటే వచ్చిన పుష్ప: ది రైజ్ పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో భాగం మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఖర్చు మాములుగా లేదని సమాచారం. చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణకు భారీ సమయం పడుతోంది. భారీ సెట్టింగులు, వందల వేల మందితో షూటింగ్ చేస్తున్నారు.
ముందుగా వారందరితో రిహార్సల్స్ చేయిస్తారు. ఆ తర్వాత షూటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా గంగా జాతర సీక్వెన్స్‌ని ఓ రేంజ్ లో షూట్ చేస్తున్నారు. రూ.40-50 కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం.
షూట్ స్టార్ట్ అయ్యే సమయానికి రూ.200 కోట్లతో సినిమా చేయాలనేది ప్లాన్. కానీ ఇప్పటికే అంచనా బడ్జెట్ 50 శాతం పెరిగింది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న పుష్ప 2 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.