Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Allu Arjun's protocol :స్టేజీ మీద అల్లు అర్జున్ ఒక్కరే వుండాలి..అది ప్రొటోకాల్ !

Advertiesment
Allu Arjun On Stage

దేవీ

, బుధవారం, 11 ఫిబ్రవరి 2026 (11:21 IST)
Allu Arjun On Stage
ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ ఉరఫ్ బన్నీ చుట్టూ తిరుగుతోంది. ఆయన హాట్ టాపిక్ గా మారారు. ఆయన  బిహేవియర్, చుట్టూ వున్న టీమ్  ఏవిధంగా వుంటుందనేది తెలియజేస్తున్నారు. టాలీవుడ్ లో సీనియర్ జర్నలిస్టు ఓ విశ్లేషణ చేస్తూ... పుష్ప కు బన్నీ ఓకే. కానీ పుష్ప 2 తర్వాత బన్నీ రేంజ్ మారిపోయింది. ఇదెందుకు ఇలా జరుగుతుంది. గతంలో చాలామంది హీరోలకు బిరుదులున్నాయి. వారంతా గుండెలపై పెట్టుకుని తిరగడంలేదుగా?  అంటూ బన్నీ పై బాణం ఎక్కు పెట్టారు.
 
ఆయన మాటల్లో... ఇవాళ మీడియాలో ఎందుకు నెగెటివ్ వస్తుందంటే. గతం నుంచి కనపడకుండా వున్నవి ఒక్కసారిగా భయటపడుతున్నాయి. అదే బన్నీ వ్యవహార శైలి. పుష్ప2 దగ్గరకు వచ్చేస రికి మారిపోయింది. పుష్ప 2 ప్రమోషన్ టైంలో బన్నీ టీమ్ ఓ ప్రముఖ వ్యక్తి దగ్గరకు వచ్చి.. సార్.. స్టేజీ మీద అల్లు అర్జున్ వుంటే ఎవరూ వుండకూడదు.. అది ప్రొటోకాల్..  అని చెప్పారు.

పుష్ప 2 ఈవెంట్లలో అన్నింటిలో ఆయన వస్తున్న స్టయిల్ కానీ నడక చూశారా.. స్లో మోషన్ స్టయిల్ లో ఒక కమాండర్ లా వుండేది. అలా ఎందుకు అంటే చెప్పలేం. టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు బిరుదులన్నాయి. సూపర్ స్టార్ లున్నారు. మెగాస్టార్, మెగా పవర్ స్టార్, పవర్ స్టార్, యంగ్ టైగర్, మాస్ మహజారాలున్నారు. ఎవరూ గుండెల్లో లేబుల్ పెట్టుకుని తిరగడం లేదుగా.. అంటూ అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నారు. మరి ఆయన మాటలు బన్నీ టీమ్ ఎలా స్వీకరిస్తుంది. అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Allu Arjun: అల్లు అర్జున్ టీమ్ కావేరి బారుహ్ పై చర్య తీసుకుంటుందా? తప్పెవరిది?