Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి ‘గిల్ట్’ టైటిల్ పోస్టర్ విడుదల

Advertiesment
guilt

డీవీ

, శనివారం, 7 సెప్టెంబరు 2024 (15:35 IST)
guilt
అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా కొత్త చిత్రం రాబోతోంది. ఇప్పటికే విరాన్ ముత్తంశెట్టి పలు సినిమాల్లో నటించి ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్‌గా పురుషోత్తముడు చిత్రంతో మెప్పించారు.
 
విరాన్ ముత్తం శెట్టి హీరోగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెరకెక్కనున్న ఈ మూవీ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో పాటుగా క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా ఉండబోతోంది. శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ బ్యానర్ మీద లక్ష్మీ సునీల, డా. పార్థసారథి రెడ్డి,  ఎ. శివ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా P శ్రీనివాస్, D శ్రీనివాస్ (వాసు) వ్యవహరిస్తున్నారు.
 
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. గిల్ట్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. టైటిల్‌తోనే సినిమా మీద అందరి దృష్టి పడేలా మేకర్లు ప్లాన్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజినీకాంత్‌ నటిస్తున్న వేట్టైయాన్ నుంచి ‘మనసిలాయో..’ లిరికల్ సాంగ్ రాబోతుంది