Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్‌.టి.ఆర్‌. శతజయంతి ఉత్సవాలకు అగ్రహీరోలంతా హాజరు

Advertiesment
prbahs, pawankalyn posters
, శుక్రవారం, 19 మే 2023 (20:40 IST)
prbahs, pawankalyn posters
దివంగత ఎన్‌.టి.ఆర్‌. శత జయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా అభిమానులతో నందమూరి బాలకృష్ణ కుటుంబం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది 100 సంవత్సరాలు జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలో ఏడాది పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు కూడా. ఇటీవలే సూర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా వుండగా ఫైనల్‌గా మే 20 అనగా రేపటికి శతజయంతి కాబట్టి హైదరాబాద్‌లో ఈ వేడుకను జరుపుతున్నారు.
 
రేపు సాయంత్రం 5 గంటల నుండి  హైదరాబాద్ కూకట్ పల్లి లోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరగనుంది. 
 
ఎన్‌.టి.ఆర్‌.కు నివాళి అర్పించేందుకు సినిమారంగ చరిత్రను సృష్టించిన ఆయనకు గౌరవవందనం చేసేందుకు పవన్‌ కళ్యాణ్‌, కన్నడ శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌, వెంకటేష్‌, జూ.ఎన్‌.టి.ఆర్‌. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, పురందేశ్వరి, జయప్రద వంటి హేమా హేమీలు రానున్నారు. ఈ సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ పోస్టర్లను హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ప్రాంతంలో ఏర్పాటు చేశారు. టి.డి. జనార్దన్‌, నందమూరి కుటుంబం కలిసి చేస్తున్న ఈ ఉత్సవానికిభారీగానే ఏర్పాటు జరిగాయి. అభిమానులు తండోపతండాలుగా రానున్నారు. అందుకు ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకునే ప్రయత్నమే హసీనా