Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ దర్శకుడు 'హైవే'పై అల్లాడించాడు.. ఊపిరున్నంత వరకూ మర్చిపోనంటున్న నటి

బాలీవుడ్ క్వీన్ అలియాభట్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. 24 యేళ్ళ ఈ హీరోయిన్ బాలీవుడ్ ప్రేక్షకులనే కాదు ఇటు తమిళ, తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. చిన్న వయస్సు నుంచే సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ముద్రను సంపాదించుకుంది అలియా భట్. ఎన్నో ప్రే

ఆ దర్శకుడు 'హైవే'పై అల్లాడించాడు.. ఊపిరున్నంత వరకూ మర్చిపోనంటున్న నటి
, గురువారం, 8 మార్చి 2018 (20:40 IST)
బాలీవుడ్ క్వీన్ అలియాభట్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. 24 యేళ్ళ ఈ హీరోయిన్ బాలీవుడ్ ప్రేక్షకులనే కాదు ఇటు తమిళ, తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. చిన్న వయస్సు నుంచే సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ముద్రను సంపాదించుకుంది అలియా భట్. ఎన్నో ప్రేమ వ్యవహారాలతో ఇప్పుడు బాగానే పబ్లిసిటీని సంపాదించుకుంది. అయితే తాజాగా అలియాభట్ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
 
ఇప్పటివరకు పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన అలియాభట్ తనకు నచ్చిన సినిమా ఒకటేనని చెబుతోంది. అదే హైవే. 2014 సంవత్సరంలో ఇంతియాజ్ అలీ దర్సకత్వంలో రూపొందిన చిత్రమిది. అలియాభట్‌కు మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చిపెట్టడమే కాదు.. అవార్డును సంపాదించే విధంగా చేసింది. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించిన అలియాభట్ హైవేకు మించిన రెస్పాన్స్ వచ్చినా, పేరు సంపాదించుకున్నా ఆ సినిమాను, దర్శకుడిని మర్చిపోవడం లేదు. 
 
ఎక్కడ ఏ సినిమా కార్యక్రమం జరిగినా హైవే సినిమాలో దర్శకుడు అలీ నన్ను బాగా చూపించారు.. బాగా నటించేలా నేర్పించారు. ఆయనకు కృతజ్ఞతలు. నా ఊపిరున్నంత వరకు ఆయన్ను మరిచిపోనంటూ ప్రతిచోటా ఇదే మాట అలియాభట్ చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒక సినిమా ప్రమోషన్‌కు వెళ్ళి అప్పుడెప్పుడో తీసిన సినిమా గురించి అలియా భట్ మాట్లాడటం దర్శకనిర్మాతలకు అస్సలు నచ్చడం లేదట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సవతి తల్లి తీరు ఎందుకు? ఏపీ చేసిన తప్పేంటి? మోడీపై మోహన్‌బాబు ట్వీట్