హీరోయిన్ అమలాపాల్‌కు దూరమై.. ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవికి దగ్గరైనట్లు వస్తున్న వార్తలపై దర్శకుడు విజయ్ స్పందించాడు. ఫిదా సినిమాతో అందరినీ ఆకట్టుకున్న సాయిపల్లవి తాజాగా కోలీవుడ్ దర్శకుడు ప్రేమలో వుందని ఆయన ఎవరో కాదని.. అమలాపాల్ మాజీ భర్త విజయ్ అని కోలీవుడ్ కోడై కూసింది. ఇంకా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని.. ప్రస్తుతం సహజీవనంలో వున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగింది.
''కణం'' సినిమా ఈ దర్శకుడితో చేసిన సాయిపల్లవి.. అతడిపై మనసుపడిందని.. వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.. కణం సినిమా సందర్భంగానే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారిందని సినీ జనం చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విజయ్ స్పష్టం చేశాడు.
సాయిపల్లవి ఈ వార్తలపై మౌనంగా తనపని తాను చేసుకుంటూ పోతున్న తరుణంలో.. విజయ్ మాత్రం తాను, సాయిపల్లవి ప్రేమించుకుంటున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారామైనవన్నాడు. ఇదంతా పనిలేనివాళ్లు చేస్తున్న ప్రచారం మాత్రమేనని పుకార్లకు తెరదించేశాడు.. విజయ్. అంతేగాకుండా ప్రస్తుతానికి సినిమాలపైనే దృష్టి పెట్టానని తేల్చి చెప్పేశాడు.