Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కినేని అఖిల్ నిశ్చితార్థం, పెళ్ళి.. ఇంతలోనే సెట్స్‌పైకి రెండో సినిమా.. కేసీఆర్‌తో నాగ్ భేటీ ఎందుకు?

త్వరలో పెళ్ళి కొడుకు కాబోతున్న అక్కినేని అఖిల్.. సినిమాపై దృష్టి పెట్టాడు. తొలి సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అక్కినేని నట వారసుడైన అఖిల్ రెండో సినిమా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాలా టైమ్ తీసుకున

Advertiesment
Akhil Akkineni reveals details about his second film
, మంగళవారం, 15 నవంబరు 2016 (14:27 IST)
త్వరలో పెళ్ళి కొడుకు కాబోతున్న అక్కినేని అఖిల్.. సినిమాపై దృష్టి పెట్టాడు. తొలి సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అక్కినేని నట వారసుడైన అఖిల్ రెండో సినిమా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. తాజాగా మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌లో అఖిల్ నటించేందుకు సై అంటున్నాడు. ఇప్పటికే రెండో సినిమాపై ఎప్పుడో ప్రకటన వచ్చేసినా.. సినిమా సెట్స్ పైకి రాలేదు. 
 
అయితే అఖిల్ సినిమా డిసెంబర్ తొలి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఆపై అఖిల్ నిశ్చితార్థ కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని సినీ యూనిట్ భావిస్తోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని.. పెళ్లికి ముందే అఖిల్ రెండో సినిమా విడుదలయ్యే ఛాన్సున్నట్లు టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఇకపోతే... అక్కినేని నాగార్జున తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. అఖిల్ నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించేందుకు నాగార్జున కేసీఆర్‌ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనసూయ 'ఏ డేట్‌ విత్‌ అనసూయ' బ్రేక్ ఎందుకు? ఐటమ్ సాంగ్ చేస్తూ బిజీనా?