Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనసూయ 'ఏ డేట్‌ విత్‌ అనసూయ' బ్రేక్ ఎందుకు? ఐటమ్ సాంగ్ చేస్తూ బిజీనా?

అనసూయ బాగా బిజీ అయిపోయింది. క్షణం సినిమా తర్వాత బుల్లితెర కార్యక్రమాలు చేస్తూనే వెండితెర ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్‌లో ఆమె 'ఏ డేట్‌ విత్‌ అనసూయ' అనే ప్రోగ్రామ్‌ ప్రారంభించింది.

Advertiesment
Anasuya busy in cinema shootings
, మంగళవారం, 15 నవంబరు 2016 (10:44 IST)
అనసూయ బాగా బిజీ అయిపోయింది. క్షణం సినిమా తర్వాత బుల్లితెర కార్యక్రమాలు చేస్తూనే వెండితెర ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్‌లో ఆమె 'ఏ డేట్‌ విత్‌ అనసూయ' అనే ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. సెలబ్రిటీలను తీసుకువచ్చి 'కాఫీ విత్‌ కరణ్‌' తరహాలో కొన్ని ఎపిసోడ్‌లు చేసింది. అయితే మూడు వారాలుగా ఆ ప్రోగ్రామ్‌ రావడం లేదు. ఇందుకు కారణం అనసూయ బిజీ కావడమేనని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఆమె సాయిధరమ్‌ హీరోగా చేస్తున్న 'విన్నర్‌'లో ఓ ఐటెం సాంగ్‌ చేస్తోంది. ఆ పాట షూటింగ్‌ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. అందకోసమే ఈ ప్రోగ్రామ్‌కు విరామం ప్రకటించిందని సమాచారం. మరోవైపు ఆ ప్రోగ్రామ్‌కు అనుకున్నంత స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌లు రావడం లేదని, అందుకే దానిని ఆపేశారని వదంతులు వినబడుతున్నాయి. వీటిలో ఏది నిజమో మరి..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సబర్ణ కేసు.. రహస్య వివాహమే కారణమా..? భర్తే సబర్ణను చంపేశాడా? ఏమైంది..?