Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

Advertiesment
Akhanda 2 cancled poster

దేవి

, శనివారం, 6 డిశెంబరు 2025 (11:40 IST)
Akhanda 2 cancled poster
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన అఖండ 2 సినిమాకుబిజినెస్ బాగా అయింది. టేబుల్ ఫ్రోఫిట్ కూడా వచ్చింది.కాని ఆ ఆనందం నిర్మాతలకు లేకుండా అయింది. సినిమాకు అనుకోని ఆటంకాలు ఇప్పుడు ఎదుయాయి. ఇండియా తో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమా ఆగిపోయింది. దానితో ఇక్కడ పంపినిదారులు మాదిరిగానే ఓవర్సీస్ లో కూడా లాస్ అయ్యారు. ఈ మేరకు వారు నిర్మాతలకు తమకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు.
 
ముందుగా బ్లాక్ చేసుకున్న సినిమా హాల్స్, ప్రివ్యూ షో లకు చాలా అయింది. సినిమా విడుదల కాకపోవడంతో దాదాపు పదకొండు కోట్ల నష్టం జరగిందని కనుక రిఫండ్ ఇవ్వాలని నిర్మాతలను కోరుతున్నారు. అదేవిదంగా ఆంధ్ర, తెలంగాణ పరిసరాల్లో కూడా ఇదే పర్తిస్థితి. అయితే వారు రాకుండా కాస్త ఆలోచించాలని ప్రముఖ నిర్మాత, ధియేటర్ ఓనర్ నట్టికుమార్ కోరుతున్నారు. 
 
అఖండ 2 సినిమాకు మల్లి ప్రీమియర్ షో వేయాలంటే గవర్నమెంట్ ను అడగాలి. ఈ సారి ఇస్తారో లేదో తెలియదు. ఇప్పటికే ప్రీమియర్ షో  కు టికెట్ కొన్నవారు వాటిని వారి దగ్గరే పెట్టుకోవాలని ధియేటర్ ఓనర్థ్ లు సూచించారు. కాగా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బేస్ చేసుకుని గత రాత్రి విడుదల అవుతుందని పలు చోట్ల ధియేటర్ కు ప్రేక్షకులు వెళ్లారు. వారిని ధియేటర్ యాజమానం తిరిగి పంపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు