Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మ వారసుడిగా హీరో అజిత్? ఏడీఎంకే వర్గాల్లో జోరుగా చర్చ.. శశికల కూడా మొగ్గు!

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం రాత్రి కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈనేపథ్యంలో.. ఆమె రాజకీయ వారసత్వంపై అన్నాడీఎంకే వర్గాలతో పాట

అమ్మ వారసుడిగా హీరో అజిత్? ఏడీఎంకే వర్గాల్లో జోరుగా చర్చ.. శశికల కూడా మొగ్గు!
, మంగళవారం, 6 డిశెంబరు 2016 (11:13 IST)
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం రాత్రి కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈనేపథ్యంలో.. ఆమె రాజకీయ వారసత్వంపై అన్నాడీఎంకే వర్గాలతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అపుడే మొదలైంది. 
 
వాస్తవానికి ముఖ్యమంత్రి జయలలిత స్థానంలో సీఎం పీఠంపై ఆమె నమ్మినబంటు రాష్ట్ర మంత్రి ఓ పన్నీర్ సెల్వం ఎంపికయ్యారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సోమవారం రాత్రే సీఎంగా ప్రమాణం చేయించారు. అయితే, ఇది కేవలం రాజకీయ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు తాత్కాలిక చర్యల్లో భాగంగా పన్నీర్ సెల్వంను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. 
 
అదేసమయంలో పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుంటే... డీఎంకేలో కరుణానిధి, ఆయన తనయుడు స్టాలిన్‌ రూపంలో బలమైన నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి జయలలిత తర్వాత అంతే బలమైన నాయకత్వం లేకపోతే, తమిళ రాజకీయాల్లో అన్నాడీఎంకే మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతుందని భావిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి జయలలితను తల్లిగా భావించిన తమిళ హీరో అజిత్‌ పేరు తెరపైకి వచ్చింది. అజిత్ అయితే డీఎంకేను ఢీ కొట్టగలడని, అంతేకాకుండా జయలలిత అజిత్‌ను కుమారుడిగా భావించేదని ఏఐఏడీఎంకే సమావేశంలో ఓ వర్గం కూడా గుర్తు చేసింది.  
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం అయితేనే బాగుంటుందని, అజిత్ అయితే మాస్‌లో ఫాలోయింగ్ పెరుగుతుంది కానీ, పార్టీ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు అనుకూలంగా సంతకాలు పెట్టినట్టు, అనంతరం అజిత్‌ను ఏఐఏడీఎంకే పగ్గాలు చేపట్టే విధంగా ఒప్పించి, పార్టీని నిలబెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
 
వాస్తవానికి జయలలిత అంతటి ప్రజాకర్షణ వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ ఒకరు. ఆ స్థాయిలో ఆకర్షణ ఉన్న హీరో అజిత్. ప్రస్తుతం అజితే అయితేనే పార్టీని కొనసాగించగలరని భావిస్తున్నారు. జయలలిత, రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ అజిత్ సొంతమన్నారు. జయలలిత కూడా ఇదే విషయాన్ని పార్టీ వర్గాలకు స్పష్టం చేశారని, పన్నీరు సెల్వం అజిత్‌కు చేదోడు వాదోడుగా ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన మరణానంతరం పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ఉండాలని, తదుపరి ఎన్నికలు వచ్చే నాటికి అజిత్‌ను నాయకుడిగా తయారు చేయాలని ఇప్పటికే ఆమె పార్టీ వర్గాలు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మకు స్వర్గంలో మరో సింహాసనం ఎదురుచూస్తోంది.. త్రిష ట్వీట్