మోడీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను.. ఒక్కసారిగా మార్పొస్తే ప్రజలు వెంటనే అలవాటు పడరు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అందాల రాశి ఐశ్వర్యారాయ్ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం సాధ్యమైనంత వరకు కామెంట్ చేయడాన్ని ఇష్టపడరు. కాన
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అందాల రాశి ఐశ్వర్యారాయ్ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం సాధ్యమైనంత వరకు కామెంట్ చేయడాన్ని ఇష్టపడరు. కానీ ప్రధాని మోడీ నోట్ల రద్దు విషయమై తీసుకున్న నిర్ణయంపై ఐష్ స్పందించారు. ఓ సిటిజెన్‌గా మోడీ నల్లధనాన్ని నిర్మూలించడానికి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు.
సమాజంలో ఏ విషయంలోనైనా ఒక్కసారిగా మార్పొస్తే దానికి ప్రజలు వెంటనే అలవాటు పడరు. కాస్త ఇబ్బందిగా భావిస్తారు. అదే ఓ చర్య కారణంగా మున్ముందు దేశంలో మార్పు వస్తుందన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తే ఎలాంటి సమస్య ఉండదని ఐశ్వర్యారాయ్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో.. నల్ల కుబేరులు ధనం దాచుకునేందుకు ప్రధాని ప్రారంభించిన ‘జన్‌ధన్’ ఖాతాలు బాగా ఉపయోగపడుతున్నారని తెలిసింది.