Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాన్నకు ప్రేమతో తరహా గెటప్.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..

'నాన్నకు ప్రేమతో' సినిమాలో గెటప్‌కు మంచి ఆదరణ వచ్చింది. ఎన్టీఆర్‌ న్యూ లుక్‌ అంటూ ఓ ఫోటో సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. ఓ పద్ధతి లేకుండా పెరిగిన గెడ్డం, దువ్వని క్రాఫ్‌తో ఆ ఫోటోలో ఎన్టీయార్‌ ఉన్నాడు.

Advertiesment
NTR New Get up in Social media
, ఆదివారం, 13 నవంబరు 2016 (15:06 IST)
'నాన్నకు ప్రేమతో' సినిమాలో గెటప్‌కు మంచి ఆదరణ వచ్చింది. ఎన్టీఆర్‌ న్యూ లుక్‌ అంటూ ఓ ఫోటో సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. ఓ పద్ధతి లేకుండా పెరిగిన గెడ్డం, దువ్వని క్రాఫ్‌తో ఆ ఫోటోలో ఎన్టీయార్‌ ఉన్నాడు. ఆ ఫోటో గురించే ఎన్టీయార్‌ ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. 
 
రాబోయే కొత్త సినిమాలో కొన్ని సీన్లలో ఎన్టీఆర్ ఈ గెటప్‌లో కనబడనున్నాడని అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఈ ఫోటో ఇప్పటిది కాదు. 'నాన్నకు ప్రేమతో' సినిమాకు ముందుంది. ఆ సినిమా కోసం గెడ్డం పెంచుతున్న సమయంలో ఇలా ఉన్నాడన్నమాట ఎన్టీఆర్‌. 
 
నిజానికి 'జనతాగ్యారేజ్‌' తర్వాత ఇప్పటివరకు తన కొత్త సినిమా విషయంలో ఎన్టీఆర్‌కే క్లారిటీ లేదు. అలాంటిది కొత్త గెటప్‌ కోసం ఎలా ప్రిపేర్‌ అవుతాడు. కాబట్టి ఎన్టీయార్‌ కొత్త గెటప్‌ అంటూ జరుగుతున్న ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని సినీ జనం అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సబర్ణ ఆత్మహత్య మరవకముందే.. మలయాళ నటి రేఖా మోహన్ అనుమానస్పద మృతి.. ఏమైంది?