Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ హీరోతో జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని ఫిక్స్

టాలీవుడ్ నటీనటులు జీవితా రాజశేఖర్ కుమార్తె శివాని త్వరలో వెండితెర అరంగేట్రం చేయనున్నారు. ఆమె హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ విషయమై రాజశేఖర్ ఫ్యామిలీ నుండి అఫీషియల్ ప్రకటన కూడా ఎప్పుడో వచ్చేసింది.

Advertiesment
ఆ హీరోతో జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని ఫిక్స్
, బుధవారం, 24 జనవరి 2018 (07:04 IST)
టాలీవుడ్ నటీనటులు జీవితా రాజశేఖర్ కుమార్తె శివాని త్వరలో వెండితెర అరంగేట్రం చేయనున్నారు. ఆమె హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ విషయమై రాజశేఖర్ ఫ్యామిలీ నుండి అఫీషియల్ ప్రకటన కూడా ఎప్పుడో వచ్చేసింది. 
 
కాక‌పోతే ఆమె తొలిసారి నటించబోయేది ఏ హీరోతో? ఎలాంటి సినిమా చేయబోతుందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆ మ‌ధ్య‌ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ హీరోగా పరిచయం అయ్యే సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోందని వార్త‌లు రాగా, లేటెస్టుగా బాలీవుడ్ మూవీ "2 స్టేట్స్" రీమేక్‌తో శివానీ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానుంద‌ని చెబుతున్నారు.
 
అడ‌వి శేష్ హీరో‌గా నటిస్తున్న ఈ సినిమాకి వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండ‌గా, ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెడుతున్నట్లు స‌మాచారం. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం. ఇటీవ‌ల శివాని నిర్వహించిన ఫోటో షూట్ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను చాలా మొండోడిని... పైగా బలవంతుడిని : పవన్ 'కత్తి'లాంటి కౌంటర్