Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదిత్య మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆది సాయి కుమార్ కొత్త సినిమా

Advertiesment
Adi Sai Kumar new movie
, గురువారం, 7 ఏప్రియల్ 2022 (16:53 IST)
Adi Sai Kumar new movie
ప్రముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  ప్రేమ కావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ యువ హీరో.. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిన ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశారు.  
 
ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఆది సాయి కుమార్ కొత్త సినిమా రాబోతోంది. తెలుగులో ఇప్పటివరకు టచ్ చేయని ఓ వైవిద్యభరితమైన కథతో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ రోజే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.  
 
పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ''జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా'' లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో  బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్  తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.    
 
టెక్నీషియన్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్ 
సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్ 
మ్యూజిక్: హర్ష వర్ధన్ రామేశ్వర్ 
ఎడిటర్: ప్రవీణ్ పూడి 
ఆర్ట్: రామాంజనేయులు  
కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి   
ప్రొడ్యూసర్: K. V. శ్రీధర్ రెడ్డి  
బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ 
ప్రెజెంట్స్: ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్.
 
నటీనటులు 
ఆది సాయి కుమార్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి.. కాంట్రాక్ట్ తలనొప్పి.. మిస్సైతే గోవిందా!