Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతి వేదికగా 'ఆదిపురుష్' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్

Advertiesment
adipurush pre release event
, సోమవారం, 5 జూన్ 2023 (12:08 IST)
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం "ఆదిపురుష్". ఈ నెల 16వ తేదీన విడుదలకానుంది. దీంతో ఈ చిత్రం తెలుగు భాషకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 6వ తేదీ మంగళవారం తిరుపతి వేదికగా నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతోంది. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర్ స్టేడియంలో ఈ ఏర్పాట్లను భారీగా చేశారు. 
 
ఈ ఆడియో రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా చిన్నజీయర్ స్వామి హాజరువుతున్నారు. ఒక సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు ఆయన హాజరుకానుండటం ఇది తొలిసారి కావడం గమనార్హం. ఈ చిత్రంలో సీతారాములుగా ప్రభాస్, కృతి సనన్‌లు నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు.
 
టి సిరీస్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇతిహాసమైన రామాయణాన్ని గతంలో అనేకమంది దృశ్య కావ్యాలుగా తెరకెక్కించారు. కానీ, భారీ బడ్జెట్‌‍లో ఈ స్థాయిలో తెరకెక్కించిన దాఖలాలు లేవు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించగా, ఈ సినిమా కోసం అనేక మంది ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్‌‍కు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌ను మంగళవారం తిరుపతిలో నిర్వహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వ యూనివర్శిటీ స్టేడియంలోఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి హాజరువుతున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్‌తో విమానం తెరకెక్కింది: కె.రాఘ‌వేంద్ర‌రావు