Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ద‌ర్శ‌కురాలుగా మారిన సీనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్... ఇంత‌కీ ఆమె ఎవ‌రు..?

Advertiesment
ద‌ర్శ‌కురాలుగా మారిన సీనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్... ఇంత‌కీ ఆమె ఎవ‌రు..?
, గురువారం, 3 అక్టోబరు 2019 (19:27 IST)
50 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన సీనియర్‌మోస్ట్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ దర్శకురాలిగా మారారు. ఇన్నేళ్ల తన అనుభవంతో మెగాఫోన్ పట్టుకుని తొలిసారిగా ఓ క్యూట్ లవ్ స్టోరీతో వస్తున్నారు. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న సినిమా ఇది. అందరూ కొత్తవాళ్లే నటించిన ఈ సినిమా ట్రైలర్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ .. ‘‘850 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన స్వర్ణ మాస్టర్ డైరెక్ట్ చేసిన అది ఒక ఇదిలే ట్రైలర్ నా చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ బావుంది. ట్రైలర్ చూస్తే ఓ క్యూట్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది. ఓ ఫ్లాట్లో ఉండే యువత మధ్య జరిగే ప్రేమకథగా నాకు అర్థమైంది. 
 
ఈ సినిమా పెద్ద విజయం సాధించి టీమ్ మొత్తానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మ‌రి... ఇన్నాళ్లు కొరియోగ్రాఫ‌ర్‌గా ఆక‌ట్టుకున్న స్వ‌ర్ణ మాస్ట‌ర్ ద‌ర్శ‌కురాలిగా కూడా ఆక‌ట్టుకుంటారేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ ఇల్లు క‌ట్టుకుంటున్నాడు, ఇంటికి పేరు ఏంటో తెలుసా..?