ఆది సాయికుమార్ హీరోగా డైమండ్ రత్నం దర్శకత్వంలో రూపొందిన ‘బుర్రకథ’ సినిమా శుక్రవారం విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. ఇందుకు కారణం సెన్సార్ బోర్డు అనుమతి (సర్టిఫికెట్) లభించకపోవటమే. దీంతో ‘బుర్రకథ’ విడుదల వాయిదా వేయటం జరిగింది.
ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు రోజుల్లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. విడుదలలో జాప్యం జరిగినందుకు చింతుస్తున్నామని.. మా చిత్రం విడుదల ఆలస్యానికి కారణాలని అర్థం చేసుకోగలరని.. ప్రేక్షకులకు, మా శ్రేయోభిలాషులు క్షమాపణ.. మీ మద్దతు ఎప్పుడు మాకు ఇవ్వగలరని ఆశిస్తూ చిత్రబృందం కోరింది. సో.. రిలీజ్ ఎప్పుడు అనే దానిపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు.