Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు.. స్టార్ హీరోలకు చుక్కలు చూపించే విలన్!

Advertiesment
వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు.. స్టార్ హీరోలకు చుక్కలు చూపించే విలన్!
, బుధవారం, 3 మార్చి 2021 (09:31 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో అదరగొడుతున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్ పాత్రలే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లో నటిస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఓ ముద్ర వేసుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్‌కు మార్చి 5న పుట్టినరోజు. స్టార్ హీరో శరత్ కుమార్, చాయా దంపతులకు మార్చి 5, 1985న వరలక్ష్మి జన్మించింది. ఈమెకు ప్రముఖ సినీనటి రాధికా శరత్ కుమార్ పిన్ని. 
 
తమిళ సినిమా ''పోడా పోడీ'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన వరలక్ష్మి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. తమిళ, కన్నడ, మలయాళం, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. సర్కార్, పందెం కోడి 2,  క్రాక్ వంటి సినిమాల్లో స్టార్ హీరోలకు విలన్‌గా చుక్కలు చూపించింది. తన నటనతో అదరగొట్టింది. 
 
అలాగే వరలక్ష్మి శరత్ కుమార్‌ గురించే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. క్రాక్‌లో జయమ్మ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ క్యారెక్టర్‌కు తెలుగు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇటీవలే విడుదలైన నాంది మూవీలోనూ వరలక్ష్మి ఆద్య పాత్రలో అదరగొట్టేసింది.
 
ప్రస్తుతం 'నాంది' మూవీ విజయాన్ని ఆస్వాదిస్తోంది వరలక్ష్మి. సినిమా హిట్ అవ్వడంతో పట్టరాని సంతోషంలో ఉంది. ''నాంది మూవీతో పాటు ఆద్య పాత్రపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. భవిష్యత్‌లో మరింత కష్టపడి మరిన్ని అద్భుతమైన పాత్రలు చేస్తాను. తెలుగు ఇండస్ట్రీకి ఇంతకన్నా గొప్ప స్వాగతం ఉండదు.'' అని తన హర్షం వ్యక్తం చేసింది.
 
అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీలోనూ వరలక్ష్మి ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. పుష్ప తర్వాత కొరటాల సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. ఆ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పాత్రకు వరలక్ష్మిని ఓకే చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే.. విక్రమ్ వేద సినిమాకు గాను.. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్‌గా సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్సును అందుకుంది. ఇంకా మరో 15 అవార్డులను కూడా వరలక్ష్మి సొతం చేసుకుంది.

ప్రస్తుతం 24 సినిమాల్లో నటించిన వరలక్ష్మి.. మరో ఆరు సినిమాల్లో నటిస్తోంది. ఇంకా బుల్లితెరపై కూడా వరలక్ష్మి సందడి చేస్తోంది. పలు షోలకు హోస్ట్ చేస్తోంది. మార్చి 5 న ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు మరిన్ని అవకాశాలు వరించాలని ఆశిద్దాం..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ సేతుపతి `విక్రమార్కుడు`