సినీ నటి తులసి యాక్టింగ్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అలనాటి నటి అయినా ఇప్పటి ట్రెండ్ కు తగినట్లు సోషల్ మీడియాలో యాక్టివ్ వుంటున్నారు. అందులోనే ఆమె రిటైర్ మెంట్ గురించి తెలిపారు.
ఈ ఏడాది డిసెంబర్ 31న షిర్డీకి వెళ్తున్నానని, ఆరోజు నుంచి సినిమాలకు దూరమై మిగిలిన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేస్తానని ఆమె పేర్కొన్నారు. తులసి 4వ ఏట నుంచి నటనా ప్రస్థానాన్ని మొదలెట్టారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సుమారు 300 సినిమాలు చేశారు. 'శంకరాభరణం'లో బాలనటిగా మంచి గుర్తింపు పొందారు. యువ హీరోలకు తల్లి పాత్రల్లోనూ కనిపించి మెప్పించారు.
మలయాళ దర్శకుడు శివమణిని వివాహం చేసుకున్నాక కొంతకాలం నటకు గేప్ ఇచ్చారు. ఇక పిల్లల బాద్యతలు అయపోయాయి. దాంతో సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో సినిమాలు చేసింది. కానీ ఆమె ఎప్పుడూ సాయిబాబా దేవుడి గురించి మాట్లాడుతుండేది. ఇప్పుడు సమయం ఆసన్నమైందని తెలియజేసింది. ఆయన సేవలో కాలం కడపాలనుకుంటున్నట్లు చెప్పారు. గతంలో కాంచనమాల కూడా బెంగుళూరులో సాయిబాబా సన్నిథిలో పనిచేసేది.