Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాన్సువాడ భానుమతి ఇమేజ్‌కు డ్యామేజ్.. ఎలా?

ఫిదా మూవీలో బాన్సువాడ భానుమతి పాత్రలో నటించిన హీరోయిన్ సాయి పల్లవి. ఈ ఒక్క చిత్రంతో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టింది తమిళ బ్యూటి. ఈ ఒక్క మూవీతోనే రాత్రికిరాత్రే స్టార్ అయిపోయిందామె. ఈ సినిమాలో ఆమె నేచ

Advertiesment
Sai Pallavi
, శనివారం, 1 సెప్టెంబరు 2018 (16:36 IST)
ఫిదా మూవీలో బాన్సువాడ భానుమతి పాత్రలో నటించిన హీరోయిన్ సాయి పల్లవి. ఈ ఒక్క చిత్రంతో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టింది తమిళ బ్యూటి. ఈ ఒక్క మూవీతోనే రాత్రికిరాత్రే స్టార్ అయిపోయిందామె. ఈ సినిమాలో ఆమె నేచురల్ యాక్టింగ్‌తో ఇరగదీసింది. దీంతో సాయిపల్లవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
 
ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి నటించిన 'ఎంసిఎ' చిత్రం కూడా ఫర్వాలేదనిపించింది. ఇలావరుసగా ఆమె రెండు సినిమాలు ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు బ్యానర్‌లోనే చేసింది. అయితే, సాయి పల్లవికి ఎంత క్రేజ్‌ వుందో ఆమె గురించిన రూమర్స్‌ కూడా అంతే బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ప్రవర్తన గురించి తెలుగు చిత్రపరిశ్రమలో పుకార్లు షికారు చేస్తున్నాయి. 
 
హీరోలని గౌరవించదని, సెట్స్‌కి సమయానికి రాకపోవడంతో పాటు నిర్మాతలంటే లెక్క లేదని ఇలా ఆమెపై చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి మొదట్లో ఈ పుకార్లను పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో ఎదుగుతున్నప్పుడు కొందరు కావాలనే ఇలా గాసిప్స్ పుట్టిస్తారని ఆమె లైట్ తీసుకుంది. అయితే, ఇలాంటి దుష్ప్రచారం వల్ల బాగానే డ్యామేజ్ అవుతుందని ఆమె గుర్తించింది. 
 
తాజాగా ఇలాంటి పుకార్లపై సాయి పల్లవి స్పందించింది. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని, తనకు ఎవరితోను ఎలాంటి విభేదాలు, సమస్య లేదని.. తనంటే గిట్టని వారు చేస్తోన్న తప్పుడు ప్రచారమని ఆమె చెప్పుకొచ్చింది. 
 
మరోవైపు సాయి పల్లవిపై పనిగట్టుకుని ఈ ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే వాదన కూడా ఉంది. అయితే, ఒక అగ్ర నిర్మాతతో సాయి పల్లవి విభేదించడం వల్లే అతడి తరపు వాళ్లే సాయి పల్లవి గురించి ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని మరికొందరి వాదన. ఏదైతేనెం.. సాయి పల్లవి ఇమేజికి ఇలాంటి అసత్య ప్రచారాలు ఎంతోకొంత డ్యామేజ్ చేస్తాయనేది కాదనలేని వాస్తవం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేడౌట్ హీరోయిన్ వద్దబాబాయ్ అంటున్న మెగా ఫ్యాన్స్...