నటి ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు సంపాదించడంతో పాటు సోషల్ మీడియాలో ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ప్రగతి సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో పాటు వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రగతి సినిమా సెట్స్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తూ ఉంటుంది.
అయితే తాజాగా.. నటి ప్రగతి పుష్ప ఐటెం సాంగ్‌పై స్టెప్పు లేసింది. అచ్చం సమంతలాగే స్టెప్పులు వేసి.. అందరిలోనూ రచ్చలేపింది. ఆ డాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.