Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీకల్లోతు ప్రేమలో సీత ... ఎవరో తెలుసా..?

అంజలి. ఈమె ముద్దు పేరు బాలత్రిపుర సుందరి. మోడల్‌గా అరగేట్రం చేసిన అంజలి ఆ తరువాత సినిమాల్లో ఛాన్సులను దక్కించుకుంది. 2006లో తమిళ సినిమాతో సినిమాల్లోకి అడుగిడిన అంజలి ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ బాషల్

Advertiesment
Actress Anjali
, సోమవారం, 26 జూన్ 2017 (11:57 IST)
అంజలి. ఈమె ముద్దు పేరు బాలత్రిపుర సుందరి. మోడల్‌గా అరగేట్రం చేసిన అంజలి ఆ తరువాత సినిమాల్లో ఛాన్సులను దక్కించుకుంది. 2006లో తమిళ సినిమాతో సినిమాల్లోకి అడుగిడిన అంజలి ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ బాషల్లో నటిస్తూ వచ్చారు. అయితే కుటుంబ సభ్యులతో కొన్నిరోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అంజలి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలో అమాయకంగా నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 2015లో అంజలికి బెస్ట్ హీరోయిన్ అవార్డు కూడా లభించింది. అయితే ఈమె తాజాగా ఒక హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉంది. అది కూడా తమిళ నటుడితోనే. ఒక్క సినిమాలోనే వీరిద్దరు కలిసి నటించి చివరకు ప్రేమకులైపోయారు. ఆ హీరోనే జై.
 
"జర్నీ" సినిమాతో అంజలి, జై వీరిద్దరు ఒక్కటయ్యారు. జై అమాయకత్వమే అంజలికి నచ్చిందట. జర్నీ సినిమాలో జై ఎలాంటి క్యారెక్టర్ చేస్తారో సేమ్ అలాంటి క్యారెక్టరే నిజం జీవితంలో కూడా ఆయనదంట. అందుకే అంజలికి తెగనచ్చేశాడు. ఈ భామే జైని మొదటగా ప్రపోజ్ చేసిందట. జై కూడా మంచి నటుడే. తమిళంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. వీరు నటించే సినిమాల్లో ఇద్దరికి గ్యాప్ దొరికితే చాలట. ఇద్దరూ చెన్నైలో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారట. ఈ మధ్య వీరిద్దరు గోవాకు వెళ్ళి రెండురోజులు ఎంజాయ్ చేసి వచ్చారని తమిళ వర్గాలు కోడై కూస్తున్నాయి. ప్రస్తుతం తమిళ సినీపరిశ్రమలో జై, అంజలి ప్రేమ వ్యవహారమే హాట్‌టాపిక్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆపరేషన్ అయ్యాక బంధువులకు అప్పగిస్తాం!