Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త.. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెబితే కట్ చేశారు.. అనన్య

Ananya Nagalla

సెల్వి

, మంగళవారం, 25 జూన్ 2024 (12:21 IST)
Ananya Nagalla
యువతను ఎక్కువగా సైబర్ నేరగాళ్లు తమ మాయమాటలతో బురిడి కొట్టిస్తున్నారు. ఇప్పటికే ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడిన పలువురు సెలబ్రెటీలు, సామాన్యులు సోషల్ మీడియా ద్వారా తమకు జరిగిన మోసాన్ని తెలియజేస్తున్నారు. 
 
తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసింది. మూడు రోజుల క్రితం సిమ్ పేరుతో నేరాలకు పాల్పడుతున్నారని తనకు కాల్ చేసి భయపెట్టారని.. డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని అడిగారంటూ చెప్పుకొచ్చింది. 
 
తన ఆధార్ కార్డ్ ఉపయోగించి ఒక సిమ్ తీసుకుని దాని నుంచి చాలా ఫ్రాడ్ చేస్తున్నారని అనన్య  చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ క్లియరెన్స్ కూడా తీసుకోవాలని అంటే సరే అన్నాను. తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయండి అంటూ స్కైప్ ద్వారా వీడియో కాల్ చేయమంటే చేశాను. వారిని చూస్తే నిజంగానే పోలీసు డ్రెస్ వేసుకుని కనిపించారు. 
 
తన సిమ్ పేరుతో మనీలాండరింగ్, డ్రగ్స్ కేసులు ఉన్నాయని తనను భయపెట్టారు. ఆ తర్వాత పది నిమిషాలకు వీడియో కాల్ ఆపేశారు. ఎంత కమీషన్ తీసుకున్నావు.. కేసు ఫైల్ చేస్తున్నాం.. జైల్లో వేస్తాం అంటూ భయపెట్టారు. వాళ్లు పంపిన డాక్యూమెంట్స్ అఫీషియల్‌గా కనిపించాయి. 
 
వెంటనే గూగుల్ చేస్తే అది ఫ్రాడ్ అని తెలిసింది. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెబితే వెంటనే కాల్ కట్ చేశారు. అమ్మాయలను టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. అంటూ చెప్పుకొచ్చింది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంగీతాభిమానులను అలరించటానికి దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన దేవి శ్రీ ప్రసాద్