Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంగీతాభిమానులను అలరించటానికి దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన దేవి శ్రీ ప్రసాద్

Devisri Prasad

ఐవీఆర్

, మంగళవారం, 25 జూన్ 2024 (12:15 IST)
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP), ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన తన సంగీత పర్యటనల తర్వాత, దేశీయ అభిమానులను అలరించటానికి సిద్దమవుతూ  తన భారతదేశ వ్యాప్త సంగీత ప్రదర్శన గురించిన విశేషాలను వెల్లడించారు. అంతర్జాతీయ సంగీత దినోత్సవం (జూన్ 21, 2024) న తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా DSP చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా అతని అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తించింది.
 
ఈ పర్యటనలో తన ప్రదర్శన జరగబోయే మొదటి నగరం గురించి అంచనాలను వెల్లడించాల్సిందిగా ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా DSP చేసిన ఒక నిగూఢమైన పోస్ట్‌తో తన అభిమానుల నడమ ఆసక్తిని  రేకెత్తించారు.  దాదాపు 25 సంవత్సరాలకు పైగా స్ఫూర్తిదాయక కెరీర్‌ను DSP  కొనసాగించటంలో ఉత్సాహపూరితమైన అతని కంపోజిషన్‌ కీలక పాత్ర పోషించింది. 
 
'అత్తారింటికి దారేది'కి ప్రతిష్టాత్మక నంది అవార్డు, 'పుష్ప: ది రైజ్'కి జాతీయ అవార్డుతో సహా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో అనేక ప్రశంసలు, అవార్డులను పొందిన DSP సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా, వైవిధ్యమైన గాయకునిగా, గీత రచయిత, కొరియోగ్రాఫర్‌గా ఖ్యాతి గడించారు. అతని సంగీతం వైవిధ్యమైన స్వరాలను సజావుగా మిళితం చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులను ఆకట్టుకుంటుంది. అతనికి 'రాక్‌స్టార్' ఖ్యాతిని తీసుకువచ్చింది.
 
ACTC ఈవెంట్స్ ద్వారా నిర్వహించబడే DSP యొక్క ఇండియా టూర్ అద్భుతమైన విజయాన్ని సాధించడానికి పూర్తిగా సిద్దమైనది. ఈ టూర్ కోసం అభిమానులు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. DSP యొక్క పర్యటన అభిమానులకు శాశ్వత జ్ఞాపకాలను సృష్టించటం మాత్రమే కాదు మ్యూజిక్ ఐకాన్‌గా అతని వైభవాన్ని సుస్థిరం చేయనుంది. DSP యొక్క ఇండియా టూర్ గురించి మరింత సమాచారం, అప్‌డేట్‌ల కోసం, అభిమానులు అతని అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లు, ACTC ఈవెంట్‌లను చూడవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్కి ప్రీ రిలీజ్- బాధతో అల్లాడిపోయిన ప్రభాస్.. కాలి గాయం తగ్గలేదా? (video)