Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు ప్రేక్షకులతో సంక్రాంతి సంబరాలు చేయనున్న హీరో సూర్య

సంక్రాంతి కానుకగా సూర్య నటించిన గ్యాంగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ నెల 12న వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ పాజిటివ్ టాక్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తూ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అటు తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ కావడం... సంక్ర

Advertiesment
Actor Suriya
, శనివారం, 13 జనవరి 2018 (17:36 IST)
సంక్రాంతి కానుకగా సూర్య నటించిన గ్యాంగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ నెల 12న వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ పాజిటివ్ టాక్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తూ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అటు తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ కావడం... సంక్రాంతి పండగకు విడుదలైన చిత్రాల్లో సూపర్బ్ టాక్ సొంతం చేసుకొని... విజయ యాత్ర చేసేందుకు తెరతీశాడు హీరో సూర్య. 
 
ఈసారి హీరో సూర్య తెలుగు ప్రేక్షకులతో సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకోనున్నాడు. తెలుగులో భారీగా ప్రమోట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతేకాదు, ఇంతటి భారీ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకుల్ని స్వయంగా పలకరించనున్నాడు. హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌తో పాటు... రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ యాత్ర చేయబోతున్నాడు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో థియేటర్స్ కూడా పెరగనుండటం విశేషం. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... సంక్రాంతి పండగ చిత్రాల్లో అద్భుతమైన ఘనవిజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షుకులకు థాంక్స్ చెప్పేందుకు హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నాం. దీంతో పాటు... హీరో సూర్య సక్సెస్ టూర్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకు తనను ఆదరించిన తెలుగు ప్రేక్షుకుల్ని స్వయంగా పలకరించబోతున్నారు. 
 
గ్యాంగ్ చిత్రంతో ఇంత మంచి విజయం అందించిన తెలుగు ప్రేక్షకుల్ని స్వయంగా కలుసుకోబోతున్నారు. అన్ని వర్గాల నుంచి సూపర్బ్‌గా రెస్పాన్స్ వస్తోది. భారీ ఓపెనింగ్స్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమాకు వస్తున్న స్పందనతో థియేటర్స్ సంఖ్య కూడా భారీగా పెరగనుంది. విగ్నేష్ శివన్ టేకింగ్, సూర్య పెర్ ఫార్మెన్స్, కార్తీక్, రమ్యకృష్ణ సర్‌ప్రైజింగ్ క్యారెక్టరైజేషన్స్, కీర్తి సురేష్ అందచందాలు, మంచి మెసేజ్, ట్విస్టులు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నాయని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్.. మీసాల్లేని సైరా నరసింహారెడ్డి