Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Advertiesment
Prudhvi Raj

ఠాగూర్

, శనివారం, 22 ఫిబ్రవరి 2025 (16:56 IST)
ప్రముఖ నటుడు, జనసేన పార్టీ నేత పృథ్వీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనను టార్గెట్ చేస్తున్న వైకాపా శ్రేణులకు తనదైనశైలిలో సమాధానమిస్తున్నారు. ఇందుకోసం తన భావాలను షేర్ చేసేందుకు వీలుగా ఆయన ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేశారు. ఇందులో ఆయన తొలిసారి ఓ పోస్ట్ చేశారు. సినీ వేదికల పైనుంచి కామెంట్స్ చేస్తే జనాలు ఫీలవుతున్నారని చెప్పారు. అందుకే ఎక్స్‌లో వచ్చానని వివరణ ఇచ్చారు. వేడి 151 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని, అందువల్ల రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
"రోజుకు 11 సార్లు నీళఅలు తాగండి.. అసలే ఎండాకాలం" అంటూ తనదైనశైలిలో ట్వీట్ చేశారు. వేడి 151 డిగ్రీల ఫారెన్ హీట్‌కి రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నా తోటి సోదరుల కోసం ఆరోగ్య చిట్కాలు అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఇటీవల ఓ సినిమా వేడుకలోనూ వేదికపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలే ఆయన చేశారు. ఇవి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన ఎక్స్ ఖాతాను ప్రారంభించారు. వేదికలపై నుంచి చేస్తే విమర్శలు వస్తున్నాయని, జనాలు ఫీల్ అవుతున్నారని, అందుకే ఎక్స్‌ లోకి ఎంటర్ అవుతున్నానని పృథ్వీ తన తొలి ట్వీట్‌లో వివరించారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)