బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఐటమ్ గర్ల్‌గా మంచి పేరు తెచ్చుకున్న మిష్టీ ముఖర్జీ కన్నుమూశారు. ఆమె వయసు 27 సంవత్సరాలు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆమె తుదిశ్వాస విడిచారు.
కొంతకాలంగా ఆమెకు కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, 2012లో లైఫ్ కి తో లగ్ గయి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అనంతరం అనేక ఐటెం సాంగ్స్‌లో నటించారు. ఆమె పలు బెంగాలీ సినిమాల్లోనూ నటించారు. 2014లో ఆమెపై సెక్స్ రాకెట్, పోర్నోగ్రఫీ కంటెంట్ వంటి ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఆమెతో పాటు ఆమె తండ్రి, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తన తల్లిండ్రులు, సోదరుడి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె కిడ్నీ వ్యాధిబారిపడి ప్రాణాలు కోల్పోయారు.