టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. అలాగే తల్లి మరణించి కనీసం రెండు నెలలు కూడా పూర్తి కాకముందే తండ్రి మరణంతో ప్రిన్స్ మహేష్ తీవ్ర ఆవేదనకు గురైయ్యారు.
అంతేగాకుండా ఏడుస్తూ నిర్మాతలకు ఫోన్ చేసి.. ప్రస్తుతానికి సినిమా షూటింగ్‌లను ఆపండి.. తాను షూటింగ్‌లకు రాలేనని స్పష్టం చేశారు. అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో కూడా తాను ఇప్పుడే నటించబోయేది లేదన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.