Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారికి రూ.80కోట్ల విలువైన ఆస్తులు రాసిపెట్టిన అర్జున్ రెడ్డి బామ్మ?

అలనాటి తార కాంచన తన ఆస్తులను ఆలయానికి దానం చేసింది. 1979, 80 కాలంలో అగ్రనటిగా పేరొందిన కాంచన.. ఎయిర్ హోస్టెస్‌గా వ్యవహరించారు. 1963వ సంవత్సరంలో శ్రీధర్ దర్శకత్వంలో కాదలిక్క నేరమిల్లై అనే తమిళ సినిమా ద

శ్రీవారికి రూ.80కోట్ల విలువైన ఆస్తులు రాసిపెట్టిన అర్జున్ రెడ్డి బామ్మ?
, గురువారం, 27 సెప్టెంబరు 2018 (11:30 IST)
అలనాటి తార కాంచన తన ఆస్తులను ఆలయానికి దానం చేసింది. 1979, 80 కాలంలో అగ్రనటిగా పేరొందిన కాంచన.. ఎయిర్ హోస్టెస్‌గా వ్యవహరించారు. 1963వ సంవత్సరంలో శ్రీధర్ దర్శకత్వంలో కాదలిక్క నేరమిల్లై అనే తమిళ సినిమా ద్వారా పరిచయమయ్యారు.


ఆ తర్వాత తమిళ అగ్రనటులు ఎంజీఆర్, శివాజీ, రజనీ కాంత్‌లతో కలిసి నటించారు. ఈ మేరకు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 150 భాషలకు పైగా కాంచన నటించారు. ఇటీవల తెలుగులో విజయ్ దేవరకొండ హీరీగో నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోకు బామ్మగా కాంచన నటించారు. 
 
ఈ నేపథ్యంలో వివాహమే చేసుకోని కాంచన తన రూ.80కోట్ల విలువగల ఆస్తులను తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి కానుకగా, దానంగా రాసిపెట్టేశారు.  ఈ సందర్భంగా కాంచన మాట్లాడుతూ.. తన అసలు పేరు వసుంధరా దేవి. ఆ సమయంలో వైజయంతి మాలా అమ్మగారు అదే పేరుతో నటిస్తున్నారు. అందుకే తన పేరును కాంచనగా శ్రీధర్ మార్చేశారు. 
 
46 ఏళ్ల పాటు విశ్రాంతి లేకుండా నటించానని కాంచన చెప్పారు. తాను సంపాదించిన డబ్బుతో చెన్నై టీనగర్‌లో ఆస్తులు కొనిపెట్టాను. అయితే బంధువులు ఆ ఆస్తులను అపహరించుకున్నారు. దీంతో కోర్టులో కేసు పెట్టి.. తన ఆస్తులను తిరిగి దక్కించుకున్నాడు. అలా తన చేతికి వచ్చిన ఆస్తులను వడ్డీ కాసుల వాడు.. శ్రీ వేంకటేశ్వరునికి కానుకగా ఇచ్చేశానంటూ కాంచన చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లీకైన నా న్యూడ్ సీన్‌ను డ్రైవర్ కూడా చూశాడట.. రాధికా ఆప్టే