Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 21 April 2025
webdunia

షిర్డీ సాయి దర్శనం... ఇవన్నీ చూశారా...?

షిర్డీ సాయికి కుటుంబ సపరివారంగా అభిషేకం చేయించుకుంటారు. అభిషేకానికి టిక్కెట్‌ చూపిస్తే పూజారి... ఒక కొబ్బరి కాయ, పసుపు, కుంకుమ, పూలు ఇస్తాడు. అభిషేకం అంతా మనం చేసుకునే తరహాలోనే సాగుతుంది. కాకపోతే మరాఠీ భాషతో సంస్కృతం కలిపి మంత్రాలు చదివుతారు. 45 నిము

Advertiesment
Significance of Shirdi Sai darshan
, గురువారం, 27 సెప్టెంబరు 2018 (11:21 IST)
షిర్డీ సాయికి కుటుంబ సపరివారంగా అభిషేకం చేయించుకుంటారు. అభిషేకానికి టిక్కెట్‌ చూపిస్తే పూజారి... ఒక కొబ్బరి కాయ, పసుపు, కుంకుమ, పూలు ఇస్తాడు. అభిషేకం అంతా మనం చేసుకునే తరహాలోనే సాగుతుంది. కాకపోతే మరాఠీ భాషతో సంస్కృతం కలిపి మంత్రాలు చదివుతారు. 45 నిముషాలపాటు సాగుతుంది. అభిషేకం ముగిశాక పూజారి ఇచ్చే కొబ్బరికాయను ఇంటికి వెళ్ళాక ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటిపైన కిటికీకి కడితే శుభం జరుగుతుందని నమ్మకం. అందుకే దాన్ని జాగ్రత్తగా తీసుకువెళతారు. ఇక ప్రసాదాల్లో పాలకోవా అక్కడ స్పెషల్‌.
 
ఇకపోతే సాయిబాబా ఆలయం ఎలా వుందంటే? 
1. సమాధి మందిరం.. అంటే షిర్డీ దర్శనం.
2. చావడి.. ఇక్కడే బాబా విశ్రాంతి తీసుకునేవారట.
3. ద్వారకామయి.. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ కాసేపు కూర్చుని వెళుతుంటారు.
4. మహల్పావతి ఇల్లు..
5. లక్ష్మీభాయి సమాధి (9 నాణేలు). బాబా ఆమెకు 9 నాణేలు ఇచ్చిన గుర్తుగా అవి చూడవచ్చు. అక్కడే ఉన్న చెక్కలాంటి స్తంభాన్ని ఆనుకుని బాబా భోజనం చేసేవారట. దాన్ని టచ్‌ చేయకుండా చుట్టూ తీగలు కట్టారు.
6.హనుమాన్‌ మందిరం
7. శ్యామా మందిరం
8. గణేష్‌మందిరం.
9. శని మందరిం. 
10. శివమందిరం.
11. ఖండోబా మందరిం. ఇది.. ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా గల ప్రాంతం. ఇక్కడే సాయిని చూసి ఖండోబా అనే జమీదార్‌ పకీరు అని పిలిచాడట. 
 
ఇవి కాకుండా చుట్టుపక్కల చూడాలంటే కాస్త దూరంలో ఉన్న వాటికి ట్రావెల్‌ ఏజెన్సీవారు ఏర్పాటు చేస్తారు.
1. ముక్తిదామ్‌. బిర్లామందిరం.. సర్వ దేవతా విగ్రహాలు ఉంటాయి.
2. త్రయంబకేశ్వరం.. 10వ జ్యోతిర్లింగం. గోదావరి పుట్టుక ఇక్కడే.
3. పంచవటి... రామాయణంలో చెప్పబడిన ప్రాంతం. 
4. ఎల్లోరా గుహలు... ఇవన్నీ.. చూడాలంటే.. తీరిక చూసుకుని వస్తే...వాటిని ఆస్వాదించవచ్చు.
 
ఇక షిర్డీ సాయిని దర్శనం చేసుకున్నాక మనకు తెలీని ఏదో మనశ్శాంతి మనల్ని ఆవరిస్తుంది. ఓ సాయిరాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-09-2018 - గురువారం దినఫలాలు - కార్యసాధనకు లౌక్యంగా ...