Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చలపతిరావు క్షమాపణ లేఖ.. నా వ్యాఖ్యలు నాకే వెగటు పుట్టించాయి.. నాతో పాటు అందరూ..?

73 ఏళ్ల వయస్సులో, 50 సంవత్సరాల సినీ జీవితంలో అనాలోచితంగా, అన్యాపదేశంగా నేను చేసిన ఒక వ్యాఖ్య దురదృష్టకరం. ఒక మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న ఇది. "ఆడవాళ్లు హానికరమా?" దానికి జవాబుగా నేను ఆడవాళ్లు హానికర

చలపతిరావు క్షమాపణ లేఖ.. నా వ్యాఖ్యలు నాకే వెగటు పుట్టించాయి.. నాతో పాటు అందరూ..?
, మంగళవారం, 23 మే 2017 (18:23 IST)
73 ఏళ్ల వయస్సులో, 50 సంవత్సరాల సినీ జీవితంలో అనాలోచితంగా, అన్యాపదేశంగా నేను చేసిన ఒక వ్యాఖ్య దురదృష్టకరం. ఒక మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న ఇది. "ఆడవాళ్లు హానికరమా?" దానికి జవాబుగా నేను ఆడవాళ్లు హానికరం కాదు.. ఆ తర్వాత నేను చేసిన వ్యాఖ్యను టీవీల్లో పదే పదే ప్రసారం చేసి నన్ను ఒక చరిత్ర హీనుడిగా మార్చేసిన పరిస్థితి. నేను బాధపడుతున్నాను. నిజమే.
 
నా వ్యాఖ్యలు నాకే వెగటు పుట్టించాయి. అవి నేను చెయ్యకుండా ఉండాల్సింది. ఈ  వ్యాఖ్యలు అభ్యంతరకరమే కాదు. ఆక్షేపణీయం కూడా. అందుకు నేను ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ఇదే సందర్భంలో నాదొక చిన్న మనవి. సినిమాల్లో, టీవీల్లో చివరికి ఇప్పటి సామాజిక మాధ్యమాల్లో.. మహిళల్ని కించపరిచే మాటలకు, దృశ్యశ్రవణాలకు మనమందరం బాధ్యులమే. 
 
పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా. ఆ విషయం మనకందరికీ తెలుసు. నాతో పాటు అందరూ.. దీనికి బాధ్యత వహించాల్సిందే. సినిమాల్లో చూపించే దృశ్యాలు, చెప్పే మాటలకు పరిశ్రమలోని రచయితలు, నిర్మాతలు, దర్శకులు నటులు అందరం బాధ్యత వహించాలి. ఇకముందు నేనే కాదు.. మరెవ్వరూ ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితికి కారణం కాకూడదు. 
 
నా మాటలకు వ్యాఖ్యలకు అందరికీ మరోసారి క్షమాపణలు చెబుతున్నాను.. మన్నించండి.. మీ చలపతిరావు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి-2లోని తప్పులు.. బొట్టు సైజు తగ్గింది.. కంటి కాటుకలో నలుపు తగ్గింది..