బాహుబలి-2లోని తప్పులు.. బొట్టు సైజు తగ్గింది.. కంటి కాటుకలో నలుపు తగ్గింది..
బాహుబలి-2 కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ అద్భుత కళాఖండంలో బోలెడు తప్పులున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. బాహుబలి-2ని చూసిన అతి తెలివి బాబులు తప్పులు ఎత్తిచూపే పనిలో బిజీబిజీ
బాహుబలి-2 కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ అద్భుత కళాఖండంలో బోలెడు తప్పులున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. బాహుబలి-2ని చూసిన అతి తెలివి బాబులు తప్పులు ఎత్తిచూపే పనిలో బిజీబిజీగా ఉన్నారు. బాహుబలి-2లోని తప్పుల్ని భూతద్దంలో పెట్టి మరీ వెతికి.. ఆ తప్పుల్ని పోస్టు చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ విధంగా బాహుబలి-2లో గల తప్పులు వైరల్ అవుతున్నాయి.
బాహుబలి-2లో నెటిజన్లు ఎత్తిచూపే తప్పులు చాలా పెద్దవి కాదండోయ్.. అనుష్క బొట్టు, కాటుక వంటి సిల్లీ తప్పులే. బాహుబలి 1కి బాహుబలి-2కి పోలిక తెస్తూ.. బాహుబలి సీన్ 1లో ప్రభాస్ చేతిలో కత్తి లేదని, తర్వాత సీన్లోకి కత్తి వచ్చిందంటూ ఫోటోలతో పోస్ట్ చేశారు.
అలాగే అనుష్క బొట్టు సైజు తగ్గిందని.. ఆమె కంటి కాటుకలో నలుపు తగ్గిందని పోస్టులు చేస్తున్నారు. బాహుబలి, దేవసేన ధరించిన ఆభరణాలు మిస్సైయ్యాయని.. ఇలా చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు. అయినా ఈ తప్పుల్ని రాజమౌళి అండ్ టీమ్ కాస్త సీరియస్‌గా తీసుకున్నా.. ఇక మార్చేంత పెద్ద తప్పులు కాకపోవడంతో లైట్‌గా వదిలేసినట్లు తెలుస్తోంది.